Elon Musk X
Elon Musk X: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌ను సొంతం చేసుకుని అనేక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే ట్విటర్ పేరును ఎక్స్‌గా మార్చారు. లోగోలోని పిట్టను తొలగించారు. బ్లూటిక్ విజయంలోనూ కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్‌కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు సిద్ధమయ్యారు. యూజర్లు హై క్వాలిటీ వీడియోలు అప్‌లోడ్ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఎక్స్ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. దీనికి ఎక్స్ టీవీ యాప్‌గా పేరు పెట్టామని తెలిపారు. ఎక్స్ టీవీ యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా యూట్యూబ్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.
అనేక మార్పులు..
‘చిన్న తెర నుంచి పెద్ద తెర వరకు ఎక్స్ అన్నింటినీ మార్చేస్తోంది. ఎక్స్ టీవీ యాప్‌తో నూతన, ఆకర్షణీయమైన కంటెంట్‌ను మీ స్మార్ట్ టీవీల్లోకి త్వరలో తీసుకు వస్తాం. పెద్ద స్క్రీన్‌లపై అత్యంత నాణ్యమైన కంటెంట్, అందులో లీనమయ్యే అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఇది రూపుదిద్దుకుంటోంది’ అని ఎక్స్ సీఈవో తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. టీవీ యాప్ విశేషాలతోపాటు ఇంటర్‌ఫేస్ ఎలా ఉండనుందనే విషయానికి సంబంధించి ఓ చిన్న వీడియోను ఆమె పోస్టు చేశారు.
యూట్యూబ్‌కు పోటీ ఇస్తుందా..
ఇదిలా ఉంటే.. ఎలాన్ మస్క్ చేస్తున్న అనేక ప్రయోగాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. ఇప్పటికే ఎక్స్‌లో పలుమార్లు మార్పులు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఎక్స్ టీవీ యాప్.. ఏమేరకు సక్సెస్ అవుతుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరక వీడియో యాప్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నది యూట్యూబ్ మాత్రమే. మరి కొత్త ఎక్స్ టీవీ యాప్ యూట్యూబ్‌కు పోటీ ఇస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతీ అంశాన్ని కమర్షియల్‌గా ఆలోచన చేసే మస్క్.. కొత్తగా లాంఛ్ చేసే ఎక్స్ టీవీ యాప్‌కు ఎంత చార్జి చేస్తారు.. వీడియో అప్‌లోడింగ్ ఎంలా ఉంటుంది. డౌన్‌లోడ్ ఆప్షన్ ఇస్తారా వంటి ప్రశ్నలు కూడా యూట్యూబ్ యూజర్ల నుంచి వస్తున్నాయి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: A new app to compete with youtube elon musk x is about to be launched