Tata new bike offer: Tata కంపెనీకి చెందిన వాహనాలు దేశంలో అత్యధిక ఆదరణ పొందుతూ ఉంటాయి. మీ కంపెనీ నుంచి వచ్చిన ఇప్పటికే ఫోర్ వీలర్స్ చాలామంది కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు టూ వీలర్ రంగంలో తన ప్రభంజనాన్ని సృష్టించడానికి కంపెనీ సిద్ధం అవుతుంది. త్వరలో 125 సిసి బైక్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అసాధారణమైన ఇంధన సామర్థ్యం తో పాటు సరసమైన ధరలతో ఆకట్టుకునే మైలేజ్ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. అయితే ఇప్పటికే ఆన్లైన్లో దీని వివరాలను అందుబాటులో ఉంచారు ఈ బైక్ ఎలా ఉంటుందో? ధర ఎలా ఉందో? ఇప్పుడు చూద్దాం
రోజువారి ప్రయాణికుల కోసం టాటా కంపెనీ 125 సిసి ఇంజన్ సామర్థ్యంతో కొత్త బైక్ ను ప్రవేశపెట్టింది. ఇది సున్నితమైన రోడ్డుతో పాటు గతుకులు ఉన్న రోడ్లపై కూడా సులభంగా వెళ్లడానికి అనుగుణంగా ఉంటుంది. ట్రాఫిక్ లోను త్వరగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఎలాంటి వైబ్రేషన్స్ స్థాయిలు లేకుండా స్థిరమైన ఇంజన్ కొనసాగుతోంది. ఈ 125 సీసీ ఇంజన్ లీటర్ పెట్రోల్ కు 90 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో దూర ప్రయాణాలు చేసే వారికి కూడా ఇది అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంధన ఖర్చులపై భారీగా ఆదా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ బైక్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో డిజిటల్ డిస్ప్లే, రియల్ టైం వేగం, USB మొబైల్ చార్జర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, ట్రిప్ మీటర్ వంటివి ఉన్నాయి. అలాగే ఆకర్షించే విధంగా LED లాంపులను అమర్చారు. దీంతో ఈ బైక్ కొత్త లుక్ లో ఆకట్టుకుంటుంది. కేవలం రైడింగ్ మాత్రమే కాకుండా సౌకర్యవంతమైన ఇంజన్ ఉండడంతో మంచి సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో డ్యూయల్ షాక్ అబ్జర్వర్లు ఉండడంతో ఎలాంటి రోడ్లపై అయినా అలజడి లేకుండా ప్రయాణం చేయవచ్చు. నగర ప్రాంతాల్లో అయితే సులభంగా ప్రయాణం చేయవచ్చు.
ఈ బైక్ లో ప్రధానంగా బ్రేకింగ్, సేఫ్టీ సెటప్ గురించి చెప్పుకోవచ్చు. ఇందులో డిస్క్ బ్రేక్ తో పాటు బ్యాక్ సైడ్ డ్రం బ్రేక్ కూడా కలిగి ఉంది. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్టాపింగ్ పవర్ తో పాటు మెరుగైన నియంత్రణను నిర్ధారిస్తుంది. గ్రిప్పి టైర్లతో రోడ్డు ట్రాక్షన్ ను అందిస్తాయి. మైలేజ్ తో పాటు స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఈ బైక్ ను సాధారణ వినియోగదారులతోపాటు ఆకర్షణ కోసం యూత్ సైతం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే వారికి అనుగుణంగా ధర అందుబాటులో ఉండనుంది. దీనిని రూ.42,000 ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఈ బైక్ కచ్చితంగా నచ్చుతుంది అని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.