Laddu Box: కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.. అన్నా పదం చెప్తే కొందరు ఇది సినిమాల్లోనే సాధ్యం.. రియల్ లైఫ్ లో జరగని పని అని అంటుంటారు. కానీ కొందరు తాము అనుకున్న పనిని సాధించడానికి తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. అలాగే నచ్చిన పని చేయడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుందని ఈ దంపతులు నిరూపించారు. అమెరికాలో లక్షల రూపాయల జీతం వచ్చిన వీరు సొంత దేశంలో ఏదైనా ప్రత్యేకంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగాలను వదిలేసి హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు వ్యాపారం కోసం పరిశోధన చేశారు. ఎలాంటి వ్యాపారం చేస్తే బాగుంటుంది? అన్న దానిపై తీవ్రంగా ఆలోచించారు. అయితే చివరికి మీరు ఎంచుకున్న వ్యాపారం ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలను తెచ్చిపెట్టింది. ఇంతకీ ఈ దంపతులు ఎవరు? మీరు చేసిన వ్యాపారం ఏంటి? ఎంతవరకు టర్నోవర్ సాధించారు?
హైదరాబాదులో లడ్డు బాక్స్ అనే స్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సందీప్ జోగిపర్తి, కవిత గోపుల అనే దంపతులు అమెరికాలో ఉద్యోగం చేసేవారు. కానీ వీరి పూర్వికులు సాంప్రదాయ స్వీట్ లను తయారుచేసి అమ్మేవారు. అయితే మీరు అమెరికాలో చేసే ఉద్యోగంపై అసంతృప్తి ఉండేది. దీంతో సొంతంగా దేశంలో వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ముందుగా ఇతర వ్యాపారం చేయాలని అనుకున్నారు. కానీ భోజనం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది. కానీ ఈ స్వీట్ ఆరోగ్యకరమైనదిగా ఉండాలని అనుకున్నారు. ఇందులో భాగంగా పోషకాలు, షుగర్ తక్కువగా ఉండే స్వీట్స్ తయారు చేయాలని అనుకున్నారు. అలా వారి ఆలోచనల నుంచి పుట్టిందే లడ్డు బాక్స్.
కామన్ గా స్వీట్స్ అనగానే అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో డయాబెటిక్ భయంతో చాలామంది దూరంగా ఉంటున్నారు. అయితే లడ్డు బాక్స్ లో ఉండే స్వీట్స్ తో ఎలాంటి అనారోగ్యం లేదా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే ఈ లడ్డు తయారీలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం, ఖర్జూరం, స్టీవియా వంటి సహజ పదార్థాలను వాడుతున్నారు. అలాగే ఇందులో తృణధాన్యాలైన రాగి, కొర్రలు, అరికలు వంటివి ఉపయోగిస్తారు. రుచిగా ఉండడానికి నెయ్యి, డ్రై ఫ్రూట్స్, అవిసె గింజలను వేస్తారు. ఈ స్వీట్స్ తో షుగర్ లేకపోవడమే కాకుండా పౌష్టికా ఆహారాన్ని తీసుకున్న వారవుతారు. అందుకే మొదట్లో వీటిని చాలా తక్కువ మంది కొనుగోలు చేసినా.. ఆ తర్వాత ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నారు.
2020 కోవిడ్ సమయంలో మీరు తమ వ్యాపారాన్ని ఆన్లైన్ కి మార్చారు. అప్పటినుంచి వీరు వ్యాపారం మరింత అభివృద్ధి సాధించింది. అప్పటివరకు ఒక ఏడాదిలో రూ. 55 లక్షల టర్నోవర్ ఉంటే.. ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించిన తర్వాత వార్షిక ఆదాయం రూ. 2 కోట్లు వస్తోంది. అయితే వీరు అందరిలాగా స్వీట్స్ లో సాధారణ పదార్థాలు కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలను ఉపయోగించడం వల్ల వీరి స్వీట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత లభించింది.