Pradeep Ranganathan: ఈ ఏడాది చిన్న సినిమాల హడావుడి మామూలు రేంజ్ లో లేవు. అటు తమిళం లో కానీ ఇటు తెలుగు లో కానీ చిన్న సినిమాలే రెండు ఇండస్ట్రీస్ ని కాపాడాయి. అలా ఈ ఏడాది చిన్న హీరో అయినటువంటి ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) స్టార్ ఆఫ్ ది కోలీవుడ్ గా అవతరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ హీరో నుండి విడుదలైన ‘డ్రాగన్’ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దాదాపుగా 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత రీసెంట్ గా విడుదలైన ‘డ్యూడ్'(Dude Movie) చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ 6 రోజుల్లో 85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతోంది.
అలా కోలీవుడ్ లో ప్రదీప్ రంగనాథన్ నుండి దాదాపుగా 250 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. అజిత్, విజయ్ మరియు రజినీకాంత్ వంటి హీరోలకు తప్ప తమిళనాడు లో ఒక ఏడాది ఈమధ్య కాలం లో ఏ హీరోకి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంత వసూళ్లు రాలేదు. సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్స్ చూడలేదు. అలాంటిది నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ ఈ రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టాడంటే ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. సూపర్ హిట్ టాక్ తో ప్రదీప్ రేంజ్ హీరోలు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాదు. కానీ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా డ్యూడ్ చిత్రానికి వంద కోట్ల గ్రాస్ వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు.
కేవలం ఒక స్టార్ కి మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి. తమిళ హీరో సూర్య భారీ బడ్జెట్ తో, భారీ హైప్ తో తన సినిమాలను విడుదల చేసి, యావరేజ్ టాక్ వచ్చినా అతి కష్టం మీద వంద కోట్ల గ్రాస్ ని అందుకున్నాడు. అలాంటిది ప్రదీప్ రంగనాథన్ అవలీల గా వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘అమరన్’ చిత్రం తో 330 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి, సెన్సేషన్ క్రియేట్ చేసిన శివ కార్తికేయన్, తన తదుపరి చిత్రం ‘మదరాసి’ తో కేవలం 90 కోట్ల గ్రాస్ ని రాబట్టాడు. వీళ్లందరినీ చూస్తుంటే ప్రదీప్ రంగనాథన్ స్టార్ స్టేటస్ ప్రస్తుతం ఎలాంటిదో అర్థం అవుతుంది. ఇదే తరహా సినిమాలు తీస్తూ ప్రదీప్ ముందుకు వెళ్తే కచ్చితంగా ఇతను మరో అజిత్ లేదా విజయ్ రేంజ్ హీరో అవుతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు.