Homeబిజినెస్Vinfast Limo Green: ఉమ్మడి కుటుంబం కలిసి హాయిగా వెళ్ళొచ్చు.. ఈ కారు ధర ఎంత...

Vinfast Limo Green: ఉమ్మడి కుటుంబం కలిసి హాయిగా వెళ్ళొచ్చు.. ఈ కారు ధర ఎంత అంటే?

Vinfast Limo Green: కార్లు కొనాలని అనుకునేవారు ఎక్కువగా EV ల వైపు చూస్తున్నారు. పెట్రోల్ బాధలేకుండా.. వాతావరణం కాలుష్యం కాకుండా ఈ కార్లు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం నగరాల్లో చార్జింగ్ పాయింట్లు కూడా పెరుగుతుండడంతో ఈవీ కార్లు అనుగుణంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని కంపెనీలు పోటీపడి ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వీటిలో Vinfast కంపెనీ కొత్త కారును 2026 ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి 2025 ప్రారంభంలో VF6, VF7 అనే SUV కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని 7 సీటర్ కారును పరిచయం చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఇప్పటికే దీని గురించి ఆన్లైన్లో సమాచారాన్ని లీక్ చేసింది. ఈ కారు ఎలా ఉండబోతుందంటే..

2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త కార్లను ప్రవేశపెట్టాయి. అయితే ఫిబ్రవరిలో Vinfast కంపెనీ లేటెస్ట్ గా Limo Green అనే ఎలక్ట్రిక్ MPV కారణం తీసుకురాబోతుంది. భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా SUV తోపాటు 7 సీటర్ కార్లను కోరుకుంటూ ఉంటారు. వీరికి అనుగుణంగా ఎలక్ట్రిక్ వేరియంట్ లో ఈ కంపెనీ కొత్త కారును పరిచయం చేయబోతుంది. దీని డిజైన్ చూస్తే ఆకట్టుకునేలా ఉంది. ఈ వెహికల్ ముందటి భాగంలో కాస్త వెడల్పు ఎక్కువగా కనిపిస్తుంది. DRL ద్వారా క్లీన్, మినిమలిస్టు పాసియాను కలిగి ఉంటుంది. విలక్షణమైన V మోటిఫ్ ను ఏర్పరుస్తాయి. నిలువుగా ఉండే హెడ్ లాంప్ యూనిట్స్ ప్రీమియం లుక్ ను అందిస్తుంది. బెస్ట్ SUV కార్ కొనాలని అనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది అని అంటున్నారు.

ఈ కారులో 59.6 KWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడింది. ఇది వరుసగా ఎర్త్, విండ్ వేరియంట్ లో 174.3 హార్స్ పవర్ తో పనిచేస్తుంది. 250 NM టార్కును రిలీజ్ చేస్తుంది. ఈ బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 468 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ కారులో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఫోర్ ఎయిర్ బ్యాగ్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్ వంటివి రక్షణను అందిస్తాయి. ఇది మార్కెట్లోకి వస్తే రూ.22 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో 7 సీట్లు ఉండడంతో ఉమ్మడి కుటుంబం అంతా కలిసి దూర ప్రయాణాలు చేయడానికి అనుగుణంగా ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి మే నెలలో దీనిని మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version