7 Seater Car: కారు కొనుగోలు చేయాలనుకునే కొందరు 7 సీటర్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా ఒకేసారి దూర ప్రయాణాలు చేసేందుకు ఈ కారు ఎంతో ఉపయోగపడుతోంది. అంతేకాకుండా లోకల్ వ్యవహారాల్లో స్టైలిష్ గా ఉండే వీటికి ఆదరణ పెరగడంతో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా వీటి ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. ఈ తరుణంలో ఓ కంపెనీకి చెందిన 7 సీటర్ కారు అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటోంది. మిగతా వాటికంటే ఇది అమ్మకాల్లో దూసుకెళ్తుండడంతో దీనికి ఎందుకంత క్రేజ్ అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ కారు ఏదీ? దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి కంపెనీ అగ్రగామిగా నిలుస్తోంది. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు ప్రత్యేకతను సంతరించుకుంటారు. ఇందులో భాగంగా మారుతి నుంచి రిలీజ్ అయిన 7 సీటర్ కారుకు ప్రాధాన్యత పెరుగుతోంది. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన ‘ఎర్టీగా’ ఇటీవల అమ్మకాల్లో జోరందుకుంది. 2024 ఫిబ్రవరిలో ఈ కారును 15, 519 మంది దక్కించుకున్నారు. ఇదే నెల గతేడాదిలో 6,472 కొనుగోళ్లు జరిగాయి. వార్షిక వృద్ధి రేటు 140 శాతం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు.
ఎర్టీగా ఫీచర్స్ ఆకట్టుకోవడంతోనే దీని అమ్మకాలు పెరిగాయని అంటున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ డిస్ ప్లే తో పాటు 7 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం ఎర్టిగాలో 4 ఎయిర్ బ్యాగ్స్ ను ఉంచారు. అలాగే క్రూయిజ్ కంట్ోల్, ప్యాడిల్ ఫిప్టర్లు, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ ఉంది. ఏబీఎస్ బ్రేక్ అసిస్ట్ తో పాటు బ్యాక్ సైడ్ పార్కింగ్ ఆకర్షిస్తాయి. ఇది పూర్తిగా సెన్సార్ తో కూడుకొని ఉంది. ఎర్టీగా 7 సీటర్ బూట్ స్పేస్ 209 లీటర్లు ఉండడంతో ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
ఈ మోడల్ ఇంజిన్ విషయానికొస్తే 1.5 లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంది. పెట్రోల్ పై 103 బీహెచ్ పీ పవర్ 136 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే సీఎన్ జీపై 88 బీహెచ్ పీ పవర్, 121. 5 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ పై ఈ కారు 20.21 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. సీఎన్ జీపై 26.11 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.