Homeబిజినెస్Yamaha NMax 155 launch India: ప్రీమియం మార్కెట్ ను షేక్ చేయనున్న Yamaha కొత్త...

Yamaha NMax 155 launch India: ప్రీమియం మార్కెట్ ను షేక్ చేయనున్న Yamaha కొత్త స్కూటర్.. ఎప్పుడొస్తుందంటే..

Yamaha NMax 155 launch India: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రీమియం స్కూటర్ల హవా నడుస్తోంది. కేవలం సిటీ ప్రయాణాలకే పరిమితం కాకుండా, పవర్, స్టైల్ , అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే వారి కోసం ప్రముఖ కంపెనీలు సరికొత్త మాక్సీ స్కూటర్లను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో Yamaha తన పాపులర్ NMax 155 స్కూటర్‌ను 2027 నాటికి భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

యమహా NMax 155 అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందింది. ఇది యమహా ‘ఏరోక్స్ 155’ అనే ప్లాట్‌ఫామ్‌పైనే తయారైనప్పటికీ, డిజైన్ పరంగా చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో మస్క్యులర్ బాడీవర్క్ పెద్ద విండ్‌స్క్రీన్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ ఉంటాయి. ఇందులో 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చనున్నారు, ఇది సుమారు 15.4PS పవర్, 14.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పర్ఫార్మెన్స్‌తో పాటు లాంగ్ రైడ్స్‌కు కూడా అనువుగా ఉంటుంది.

భారత మార్కెట్లో హోండా కూడా తన అత్యంత ఆసక్తికరమైన అడ్వెంచర్ స్కూటర్ ADV160ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. యమహా NMax 155 , హోండా ADV160 రెండూ కూడా ఒకదానికొకటి గట్టి పోటీనివ్వనున్నాయి. ADV160 అడ్వెంచర్ లుక్‌తో అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఇది గతుకుల రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించేలా చేస్తుంది. యమహా NMax 155 ప్రధానంగా సిటీ క్రూయిజర్‌గా, లాంగ్ టూరింగ్‌కు అనువుగా నిలుస్తుంది.

ఈ రాబోయే స్కూటర్లలో అత్యాధునిక ఫీచర్లు ఉండనున్నాయి. కీ లెస్ ఇగ్నిషన్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ప్రామాణికంగా ఉండే అవకాశం ఉంది. NMax 155 లో 13 అంగుళాల చక్రాలు, డిస్క్ బ్రేక్‌లు ఉండటం వల్ల రైడింగ్ చాలా స్థిరంగా ఉంటుంది. అలాగే, ఏరోక్స్ 155 తో పోలిస్తే, NMax లో కొంత ఎక్కువ స్టోరేజ్ స్పేస్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని ఆశించవచ్చు.

భారతీయ యువత ఇప్పుడు సాధారణ స్కూటర్ల నుంచి పవర్‌ఫుల్, స్టైలిష్ మాక్సీ-స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 150 నుంచి160cc సెగ్మెంట్‌లో యమహా, హోండా, హీరో వంటి కంపెనీలు పోటీ పడుతుండటంతో వినియోగదారులకు ఎంపికలు పెరుగుతున్నాయి.

కొన్ని అంచనాల ప్రకారం, యమహా NMax 155 ధర రూ. 1.50 లక్షల ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. అధికారికంగా లాంచ్ తేదీలపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ, 2027 ప్రారంభంలో లేదా అంతకంటే ముందే భారత రోడ్లపై ఈ ప్రీమియం స్కూటర్లను మనం చూడవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version