Homeఆంధ్రప్రదేశ్‌Jagan Kapu Politics: జగన్ 'కాపు' రాజకీయం!

Jagan Kapu Politics: జగన్ ‘కాపు’ రాజకీయం!

Jagan Kapu Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల లక్ష్యంగా చాలా రకాల వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా పార్టీ జనసేన పై ఫుల్ ఫోకస్ పెట్టింది. జనసేన ను దారుణంగా దెబ్బతీయాలని చూస్తోంది. కాపులను జనసేనకు దూరం చేస్తే ఆ ప్రభావం కూటమిపై పడుతుందని.. అదే జరిగితే ఇతర పక్షాల మద్దతుతో చాలా సులువుగా అధికారంలోకి రావచ్చని అంచనా వేస్తోంది. అయితే అది అంత తేలికైన విషయం మాత్రం కాదు. ముఖ్యంగా జనసేన నుంచి కాపులను ఇప్పట్లో వేరు చేయడం కుదిరే పని కాదు. ఎందుకంటే కాపులు పవన్ కళ్యాణ్ విషయంలో కొంత సంతృప్తితో అయితే మాత్రం ఉన్నారు. తమ వాడు డిప్యూటీ సీఎం పదవి వరకు వచ్చాడు అని.. ఏపీలో పాలనలో భాగస్వామ్యం అవుతున్నాడని.. ఆయన నిర్ణయాలకు గౌరవం లభిస్తుందని వారిలో సంతృప్తి ఉంది. అయినా సరే కాపులను విభజిస్తే తప్ప రాజకీయాలు చేయలేమని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాపుల మద్దతు కోసం ఒకవైపు.. జనసేనకు దూరం చేసేందుకు మరోవైపు జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు.

* కాపు నేతలు ఉన్నా..
ప్రస్తుతం కాపులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. కాపు నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కురసాల కన్నబాబు.. ఇలా పేరు మోసిన నేతలంతా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. అయితే వీరి ద్వారా కాపులను ఆకర్షించే ప్రయత్నం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీరు ఆకర్షించే స్థితిలో లేరు. ఎంతవరకు పవన్ పై విమర్శలు చేయగలరే తప్పించి.. వీరికి మరో పని చేతకాదు. పోనీ ముద్రగడ పద్మనాభం, హరి రామ జోగయ్య లాంటి వారిని తిరిగి ప్రయోగిస్తామంటే కాపులు మరింతగా తిరస్కరిస్తారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు కూడా. అందుకే కొత్త కాపుల కోసం ఆయన అన్వేషిస్తున్నారు. అందుకే దాసరి రాము, వంగవీటి కుటుంబం వంటి వారిపై ఆశలు పెట్టుకున్నారు.

* అప్పుడు అలాంటి ప్రయత్నం..
పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకోకుండా హరిరామ జోగయ్య పేరు చెప్పుకొని చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో. ఒకవేళ పొత్తు పెట్టుకున్న సగానికి పైగా సీట్లు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ ను కోరమని చెప్పారు. లేకుంటే పొత్తు వద్దు అని తేల్చేయమని సలహా ఇచ్చారు. ఎప్పటికప్పుడు హరి రామ జోగయ్య పేరుతో లేఖలు రాసి పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం అయితే జనసేనలోకి వచ్చి.. తనదైన వైసీపీ ప్రయోజనాల కోసం కృషి చేయాలని చూశారు. దానిని ముందుగానే గ్రహించారు పవన్ కళ్యాణ్. అందుకే జనసేనలోకి ముద్రగడ ఎంట్రీని లేకుండా చేశారు. ఆ కోపంతోనే ముద్రగడ వైసీపీలోకి వెళ్లారు. పవన్ ను ఓడిస్తానని శపథం చేశారు. ఓడించలేక పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకున్నారు.

* కొత్త వారి కోసం ఆరాటం..
జగన్మోహన్ రెడ్డి ముందుగా హరి రామ జోగయ్యను వాడేసారు. తరువాత ముద్రగడ పద్మనాభంను వాడేసారు. ఇప్పుడు కొత్తగా వాడేందుకు దాసరి రాము కనిపిస్తున్నారు. అవసరం అనుకుంటే వంగవీటి కుటుంబంలో ఒకరిని తెచ్చి కాపు రాజకీయంతో కాక రేపాలని చూస్తున్నారు. కానీ వారు ముందుకు వస్తారా లేదా అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version