Car Insurance: కారు కొంటున్నారా.. రవాణా చట్టం ప్రకారం కొత్త వాహనం ఏది కొన్నా.. ఇప్పుడు ఇన్సూరెన్స్ అన్నది కచ్చితం అయింది. ఇన్సూరెన్స్ లేకుండా ఏ వాహనం షోరూం నుంచి బయటకు రాదు. అయితే కారు కొంటున్నవారు.. ఇన్సూరెన్స్ చార్జీలు చూసి భయపడుతున్నారు. అయితే మీరు ఇలా చేస్తే ఇన్సూరెన్స్‌పై 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందా..
పాత కారుపై కెయిమ్ చేయకుంటే..
పాత కారు అమ్మేసి కొత్తకారు కొనే వారు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పాతకారుపై ఉన్న ఇన్సూరెన్స్‌ను గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయనివారు కొత్తగా కొనుగోలు చేసే కారు ఇన్సూరెన్స్‌పై ఈ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
ఈ పత్రం తీసుకోవాలి..
ఇక పాతకారు ఇన్సూరెన్స్ ఆధారంగా కొత్తకారు ఇన్సూరెన్స్ చార్జిపై 50 శాతం డిస్కౌంట్ పొందాలంటే కచ్చితంగా నో కెయిమ్ బోనస్ రిటెన్షన్ లెటర్(No Claim Bonus Retention Letter) తీసుకోవాలి. ఇది నిన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఈ లెటర్ తీసుకుని కొత్తకారు కొనుగోలుకు చేసిన వారికి ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీ వసూలు చేసే చార్జీ మొత్తంలో 50 శాతం డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ లెటర్ లేకుంటే డిస్కౌంట్ రాదు.
క్లెయిమ్ చేయకుంటేనే సర్టిపికెట్..
ఇక గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయని వారికి మాత్రేమ పాత కారు ఇన్సూరెన్స్ కంపెనీ ఈ నో కెయిమ్ బోనస్ రిటెన్షన్ లెటర్ ఇస్తుంది. కొత్తగా కొనుగోలు చేసే కారుపై డిస్కౌంట్ ఇవ్వొచ్చని అందులో పేర్కొంటుంది. కొత్త, పాత కారు ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక్కటే అయితే ఈ పని మరింత ఈజీ అవుతుంది. కారు లవర్స్ వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.