Good News: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు శుభవార్త చెప్పాయి. మహాశివరాత్రి సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించాయి. మార్చి 8న శుక్రవారం మహాశివరాత్రి. ఆరోజు సెలవు. శనివారం సెకండ్ సాటర్‌డే. తర్వాత ఆదివారం దీంతో మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈమేరకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగులకు కూడా..
ఇక ఈ సెలవులు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తించనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా జాగరణ చేసేవారికి వరుస సెలవులు ఉపయోగపడనున్నాయి. వేములవాడ, శ్రీశైలం, కాళేశ్వరం వంటి శైవక్షేత్రాలకు వెళ్లేవారు సెలవు పెట్టాల్సిన అవసరం ఉండదు.
బ్యాంకులు బంద్..
ఇక వరుస సెలవుల నేపథ్యంలో బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. మార్చి 8న శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అని బ్యాంకులకు సెలవు. మరుసటి రోజు రెండో శనివారం. ప్రతీనెల రెండు, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు దీంతో 9వ తేదీన కూడా బ్యాంకులు తెరుచుకోవు. ఇక తర్వాత 10వ తేదీ ఆదివారం. ఇది రెగ్యులర్ హాలిడే. దీంతో బ్యాంకులు కూడా మూడు రోజులు తెరుచుకోవు. దీంతో ఆ మూడు రోజుల్లో ఏదైనా కార్యక్రమాలు పెట్టుకునేవారు ముందుగానే అలర్ట్ కావాలి. లేదంటే నగదు కోసం ఇబ్బందులు తప్పవు.