https://oktelugu.com/

Car Offers: ఆ కారు పై ఏకంగా రూ.4.2 లక్షల డిస్కౌంట్..

ఆటోమోబైల్ రంగంలో నెంబర్ వన్ స్ఠానానికి పోటీ పడుతున్న కార్ల కంపెనీల్లో ఫోక్స్ వాగన్ ఒకటి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి పలు మోడళ్లు రోడ్లపై తిరుగుతూ ఆకర్షిస్తున్నాయి. అయితే తాజాగా ఓ కారుపై ఏకంగా రూ.1.13 లక్షల డిస్కౌంట్ ను ప్రకటించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 2, 2023 / 12:05 PM IST

    Car Offers

    Follow us on

    Car Offers: సొంత అవసరాలతో పాటు విహార యాత్రలకు వెళ్లాలనుకునేవారు సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఆఫర్లు ప్రకటించినప్పుడు కారును కొనుగోలు చేయడం వల్ల తక్కవ ధరకే వెహికల్ వస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు కొన్ని సందర్భాల్లో భారీ ఆఫర్స్ ను ప్రకటిస్తాయి. లేటేస్టుగా ఫోక్స్ వాగన్ కంపెనీ కళ్లు చెదిరే డిస్కౌంట్ ను ప్రకటించింది. ఏకంగా లక్ష డిస్కౌంట్ లో కారును తీసుకెళ్లొచ్చని తెలిపింది. ఇంతకీ ఆ మోడల్ ఏంటి? దాని వివరాల్లోకి వెళితే..

    ఆటోమోబైల్ రంగంలో నెంబర్ వన్ స్ఠానానికి పోటీ పడుతున్న కార్ల కంపెనీల్లో ఫోక్స్ వాగన్ ఒకటి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి పలు మోడళ్లు రోడ్లపై తిరుగుతూ ఆకర్షిస్తున్నాయి. అయితే తాజాగా ఓ కారుపై ఏకంగా రూ.1.13 లక్షల డిస్కౌంట్ ను ప్రకటించింది. అదే టైగూన్. పెట్రోల్ ఫ్యూయెల్ కలిగిన ఈ కారు 999 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. అలాగే 113.98 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 సీటర్ తో ఉన్న ఈ కారు లీటర్ పెట్రోల్ కు 17.88 నుంచి 20.08 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    ఈ కారు ప్రస్తుతం 11.62 లక్షల ప్రారంభ ధరను కలిగి ఉంది. దీనిపై 1.46 లక్షల వరకు తగ్గింపును ప్రకటించారు. ఇందులో ఎక్స్చేంజ్ బోనస్ రూ.40 వేలు, క్యాష్ డిస్కౌంట్ రూ. 40 వేలు, కార్పొరేట్ బోనస్ రూ.30 వేలు. స్పెషల్ డిస్కౌంట్ రూ.36 వేల వరకు తగ్గింపు చేస్తున్నారు. మరో మోడల్ టిగువన్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.75 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ లక్ష, స్పెషల్ డిస్కౌంట్ రూ.84 వేల వరకు ప్రకటించారు. ఇలా మొత్తం కలిపి రూ.4.2 లక్షల తగ్గింపును ప్రకటించారు.

    ఈ ఆఫర్లు ఆయా ప్రాంతాలను భట్టి మారుతాయని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే ఆఫర్ల గురించి డీలర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. దీపావళి తరువాత కూడా ఈ కంపెనీ ఆఫర్లను ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొంత మంది ఈ డిస్కౌంట్లు చూసి కార్లు కొనేందుకు రెడీ అవుతున్నారు.