Suzuki Swift: దేశీయ ఆటోమోబైల్ రంగంలో మారుతి సుజుకీ నెంబర్ వన్ స్థానం కోసం ఎప్పటికప్పుడు పోటీ పడుతోంది. ఈ క్రమంలో కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. మారుతి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన చాలా కార్లు ఆకట్టుకున్నాయి. వీటితో మారుతి స్విప్ట్ ఒకటి. మారుతి సుజుకి నుంచి హ్యాచ్ బ్యాక్ వేరింట్ లో స్విప్ట్ రోడ్లపై తిరుగుతోంది. అయితే దీనిని ఎస్ యూవీ లెవల్లో అప్ గ్రేడ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఇందులో ఫీచర్స్ తో పాటు కొన్ని పరికరాలను అప్డేట్ చేశారు. ఈ కారు ఎలా ఉందో చూద్దాం..
2023 అక్టోబర్ లో వస్తున్న దసరా సందర్భంగా 26 నుంచి నవంబర్ 5 వరకు సుజుకి మోటార్ కార్పొరేషన్ జపాన్ మొబిలిటీ షో ను నిర్వహించనున్నారు. టోక్యో బిగ్ సైట్ వేదికగా నిర్వహించే ఇందులో మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ ఎస్ యూవీ, eWX ప్రొడక్షన్ ను పరిచంయ చేయనుంది. వీటితో పాటు 2024 స్విప్ట్ కాన్సెప్ట్ ను కూడా తీసుకొస్తుంది. ఇప్పుడున్న స్విప్ట్ ను కొత్త తరహాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని ఫీచర్స్ పై అందరికీ ఆసక్తి నెలకొంది.
2024 స్విప్ట్ కాన్సెప్ట్ లో 9 ఇంచెస్ ఫ్రా స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, సెమి డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ కన్సోల్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్ ప్లే కలిగి ఉన్నాయి. ఇది 1.2 లీటర్ పెట్రోల్ తో పాటు 3 సిలిండర్ సీఎన్ జీని కలిగిఉంది. ఇది లీటర్ కు 40 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న స్విప్ట్ హ్యాచ్ బ్యాక్ కంటే ఇది భిన్నంగా ఉంటోంది. ప్రస్తుతం గ్రే కలర్లో అందుబాటులో ఉన్న ఈమోడల్ బలమైన హైబ్రిడ్ పవర్ ట్రైయిన్ తో తయారైంది.
2024లో సుజుకిస్విప్ట్ ను స్టైలింగ్ లో కనిపిస్తుంది.ఇది డ్రైవ్ అండ్ ఫీల్ అనే కాన్సెప్టుతో డిజైన్ చేశామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది క్లామ్ షెల్ బానెట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులోని ఎల్ ఈడీ స్టైలిష్ గా ఉంది. అయితే దీనిని ముందుగా పరిచయం చేసి ఆ తరువాత 2024లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిని రూ.6.50 లక్షల నుంచి రూ.10.50 వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది.