Hyundai Santa Fe: కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలో కొత్త మోడళ్లు ఆవిష్కరిస్తున్నాయి. అప్డేట్ ఫీచర్లు.. అదిరిపోయే లుక్స్ లో తయారు చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ధరల్లోనూ మిగతా వాటి కంటే తక్కవకు అందిస్తూ అలరిస్తున్నాయి. లేటేస్టుగా హ్యుండాయ్ కి చెందిన ఓ మోడల్ ఇంప్రెస్ చేస్తుంది. పూర్తిగా బాక్సీ లా ఉన్న ఈ కారును చూసి కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటి వరకు మార్కెట్లో కొనసాగుతున్న టాటా హారియర్, టయోటా ఫార్చ్యునర్ కు హ్యుండాయ్ సాటా ఫీ గట్టి పోటీ ఇస్తుందని ఆటోమోబైల్ రంగంలో ఆసక్తి చర్చ సాగుతోంది. ఇంతకీ ఈ మోడల్ విశేషాలేంటో తెలుసుకుందాం..
ప్రతీ ఏడాదో కొత్త కారును తీసుకొచ్చే హ్యుండాయ్ ఈసారి 2024 మోడల్ సాటా ఫీని ఇటీవల ఆవిష్కరించింది. ఇది పూర్తిగా బోల్డ్, బాక్సీ లుక్స్ తో ఉండడంతో చూడగానే ఆకర్షితులవుతున్నారు. సాంతా ఫీ ప్రీమియం కారు ఇంటీరియర్స్ ను పూర్తిగా రీ డిజైన్ చేసిన మరింత క్లాసీగా తయారు చేశారు. ఇందులో పానోరమిక సన్ రూప్, వైర్ లెస్ చార్జర్లు కొత్తగా అమర్చారు. 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫటైన్ మెంట్ కన్సోల్ ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్ లో రెండు కప్ హోల్డర్స్ అలరిస్తన్నాయి.
పూర్తిగా పర్యవారణ రహిత ప్రమాణాలతో కూడిన ఇందులో ఇంజన్ 2199 సీసీ ఇంజన్ ఉంది. 194.3 బీహెచ్ పీ పరవ్ తో 4 డబ్ల్యూడీ డ్రైవ్ చేయొచ్చు. డీజిల్ ప్యూయల్ కలిగిన ఈ మోడల్ 13.01 నుంచి 14.74 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఈ కారు సైడ్ నుంచి చూస్తే లేటేస్ట్ సాంటాఫీ మోడల్ చాల పెద్దగా కనిపిస్తుంది. రూఫ్ లైన్ కు అనుగుణంగా వీల్ బేస్ ను పెంచినట్లు తెలుస్తోంది. ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్ తమ లోగోకు అనుగునంగా హెచ్ షేప్ లో తీర్చిదిద్దడంతో ఆకట్టుకుంటోంది.
ఇప్పటి వరకు ఇవే ఫీచర్లతో ఆకట్టుకున్న టాటా హారియన్, టయోటా ఫార్చ్యునర్ కు ఇది గట్టి పోటీ అంటున్నారు. వాటి కంటే ఇది బాక్సీ లుక్ లో విపరీతంగా ఆకట్టుకుంటుంది. టాటా హరియన్ ఎక్స్ షో రూం ధర రూ.15 నుంచి 24 లక్షలతో విక్రయిస్తుండగా.. టయోటా ఫార్చ్యునర్ ను రూ.32 లక్షలతో అమ్ముతున్నారు. అదే హ్యుండాస్ సాంటా ఫీ ని రూ.28 నుంచి 32 లక్షలతో విక్రయిస్తున్నారు. లేటేస్టు మోడల్ గా వస్తున్న ఈ మోడల్ ను కొనేందుకు వినియోగదారులు రెడీ అవుతున్నారు.