https://oktelugu.com/

Bank Holidays : బ్యాంకు ఖాతాదారులకు బీ అలెర్ట్.. ఇకపై వారానికి రెండు రోజులు సెలవులు?

Bank Holidays : బ్యాంకు ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు రానున్నాయి. బ్యాంకు ఉద్యోగులకు వీకాఫ్ లు రెండు రోజులుగా నిర్ణయించారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజులు పనిదినాలు, రెండు రోజులు సెలవులు తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదన సానుకూలంగా ఉండటంతో ఉద్యోగులు ప్రతి రోజు 50 నిమిషాల పాటు అదనంగా విధులు నిర్వహించాలి. దీంతో బ్యాంకులు ఐదు రోజులు పనిచేసి శని, ఆదివారాలు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇండియన్ బ్యాంక్ ఆఫ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 1, 2023 / 08:25 PM IST
    Follow us on

    Bank Holidays : బ్యాంకు ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు రానున్నాయి. బ్యాంకు ఉద్యోగులకు వీకాఫ్ లు రెండు రోజులుగా నిర్ణయించారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజులు పనిదినాలు, రెండు రోజులు సెలవులు తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదన సానుకూలంగా ఉండటంతో ఉద్యోగులు ప్రతి రోజు 50 నిమిషాల పాటు అదనంగా విధులు నిర్వహించాలి. దీంతో బ్యాంకులు ఐదు రోజులు పనిచేసి శని, ఆదివారాలు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తోంది.

    ఇండియన్ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల వర్క్ కు అసోసియేషన్ సూత్ర్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నెగోషియబుల్ ఇన్స్టుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించనున్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నాగరాజన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. ఇదివరకు రెండో శనివారం, నాలుగో శనివారం సెలవులుగా ఉంటున్నాయి. ఇక మీదట ప్రతి శని, ఆదివారాలు సెలవుగా రానున్నాయి.

    ప్రభుత్వ రంగ బ్యాంకుల యజమానిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే బ్యాంకులు ఇకపై ఉదయం 9.45 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులకు నెలకు 6 లేదా 7 సాధారణ సెలవులు వస్తున్నాయి. వీటిలో 4 లేదా 5 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులు తెరుచుకోవు. వీకాఫ్ పద్ధతి అమల్లోకి వస్తే మరో రెండు రోజులు అదనంగా వస్తాయి. మిగతా ఐదు రోజులు అదనంగా పని చేయాల్సి ఉంటుంది.

    ఉద్యోగులు ఎన్నో రోజులుగా చేస్తున్న డిమాండ్లతో బ్యాంక్ అసోసియేషన్ లెక్కలోకి తీసుకోవడంతో వీకాఫ్ ప్రతిపాదనలు ఆమోదం కానున్నాయి. ఇలా అయితే వారానికి ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. శని, ఆదివారాలు సెలవులు రానున్నాయి. ప్రతి ఆర్థిక వ్యవహారం బ్యాంకులతో ముడిపడి ఉండటంతో వీకాఫ్ సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. వారి డిమాండ్లు నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు.