Good News For Farmers : భారతదేశానికి వెన్నెముక రైతు. అందువల్ల రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎంతో నిరాధారణకు గురైన రైతులను ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పంట పెట్టుబడికి అవసరమైన సాయం అందిస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన కింది ప్రతీ ఏటా రైతులకు రూ.6000 అందిస్తన్నారు. ఇవి ఒకే సారి కాకుండా రూ.2000 చొప్పున మూడు విడుతలుగా అందిస్తున్నారు. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు శుభవార్త తెలిపింది. రైతులు తీసుకునే రుణాలను రూ.2 లక్షలకు పెంచింది. ఆ వివరాల్లోకి వెళితే..
వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో కొందరు రైతులు అప్పులు చేస్తున్నారు. అయితే పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు లేదా ఇతర కారణాలతో పెట్టుబడి కూడా రాకపోవడంతో కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పులు తీర్చడానికి రైతులు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులకు కొన్ని బ్యాంకులు ఎలాంటి తనఖా లేకుండా రుణాలను అందిస్తన్నాయి. ఇవి రూ.10,000 నుంచి ప్రారంభమై.. ప్రస్తుతం రూ.1.6 లక్షల వరకు అందిస్తోంది.
ఈ రుణ పరిమితిని ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు రూ. 2 లక్షలకు పెంచింది. అంటే బ్యాంకు నుంచి ఎలాంటి తనఖా లేకుండా లోన్ తీసుకోవాలని అనుకునేవారు రూ. 2 లక్షల వరకు తీసుకోవచ్చు. వీటిపై వడ్డీ కూడా తక్కువగానే ఉంటోంది. అయితే దీనిని చాలా రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. రైతులకు ఇలాంటి రుణాలు అందకపోవడంతో చాలా మంది ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. దీంతో వారు తెచ్చిన అప్పుడు తీర్చలేక వడ్డీలే కడుతున్నారు. ఈ రుణాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు.
వ్యవసాయ పెట్టుబడుల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి లోన్ ఇచ్చే పరిమితిని కూడా పెంచాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బ్యాంకులు ఈ నిబంధనల ప్రకారం కొత్త లోన్ విధానాన్ని అమలు చేయాలని సూచిస్తోంది. ఈ రుణ సదుపాయం వల్ల 86 శాతం మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఈ రుణాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని బ్యాంకులు ఇవి అమలు చేయడం లేదు.
ఇదిలా ఉండగా కొత్త రుణ మార్గదర్శకాలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది. వ్యవసాయ రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించడంతో పాటు వారి ఉపాధి మెరుగుపరచడానికి ఈ రుణాలు ఉపయోగపడుతాయని అంటున్నారు. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో రైతులు బ్యాంకులో అప్పులు తీసుకొని వడ్డీలు మాత్రమే కడుతున్నారు. ఈ వడ్డీలు కట్టలేని వారు కొన్ని వస్తువులను తనఖా పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఈ రుణ సదుపాయం ఎంతో ఉపయోగపడనుంది.