Border Gavaskar Trophy History: టెస్ట్ క్రికెట్లో యాషెస్ తర్వాత ఆ స్థాయి ఉన్నది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ ట్రోఫీ చరిత్ర చూస్తే ఇప్పటివరకూ ఆస్ట్రేలియాపై ఇండియానే పైచే సాధించింది. చివరి మూడుసార్లూ ఇండియానే సిరీస్ గెలవడం విశేషం.
అలన్ బోర్డర్, సునీల్ గవాస్కర్.. ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్లోని ఆల్ టైం గ్రేట్ ప్లేయర్స్ లో వీళ్ళ పేర్లు టాప్ లో ఉంటాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లకు ఈ ఇద్దరు పేర్ల మీదుగానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనే పేరు పెట్టారు. 1996 నుంచి ఈ సిరీస్ జరుగుతున్నది. ఇప్పటివరకు 15 సీరిస్ లు జరిగాయి. ఇక ఇప్పుడు ఇండియాలో జరగబోయే 16వ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా టీం వచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్ పూర్ లో సిరీస్ ప్రారంభం కానుంది.
ప్రపంచ క్రికెట్ ను ఆస్ట్రేలియా దశాబ్దాల పాటు ఏలినా… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మాత్రం ఇండియాదే పై చేయి సాధించింది. ఇప్పటివరకు అత్యధిక టెస్ట్ మ్యాచ్ లు, సిరీస్ విజయాలూ సాధించింది టీమిండియానే. మొత్తంగా చూస్తే రెండు దేశాల మధ్య 102 టెస్టులు జరిగాయి. అందులో 43 విజయాలతో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. 1996లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైన తర్వాత ఇండియా హవా మొదలైంది. ఈ ట్రోఫీలో భాగంగా రెండు దేశాల మధ్య 52 టెస్టులు జరిగాయి. ఇందులో 22 ఇండియా గెలిచింది. టీం ఇండియా విజయాల శాతం 42.03% గా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా 19 టెస్టుల్లో విజయం సాధించింది. ఆ జట్టు విజయాల శాతం 36.53% గా ఉంది. మరో 11 మ్యాచులు డ్రాగా ముగిశాయి. 1996/97 లో ఇండియాలో సీరిస్ జరిగితే 1-0 తేడాతో ఇండియా గెలిచింది.. 1997/98 లో ఇండియాలో సీరిస్ జరిగితే 2_1 తేడాతో ఇండియా గెలిచింది. 1999/2000 లో ఆస్ట్రేలియాలో సిరీస్ జరిగితే కంగారు జట్టు 3_0 తేడాతో వైట్ వాష్ చేసింది. 2000/01లో ఇండియాలో సిరీస్ జరిగితే 2-1 తేడాతో ఇండియా సిరీస్ గెలుచుకుంది. 2003/04 లో ఆస్ట్రేలియాలో సిరీస్ జరిగితే 1_1తో డ్రాగా ముగిసింది. 2004/05 లో సిరీస్ జరిగితే 2_1 తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. ఆస్ట్రేలియాలో 2007/08 లో సిరీస్ జరిగితే ఆస్ట్రేలియా 2_1 తేడాతో గెలుచుకుంది. 2008/09 లో ఇండియాలో సిరీస్ జరిగితే ఇండియా 2_0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. 2010/11 లో ఇండియాలో సిరీస్ జరిగితే ఇండియా 2_0 తేడాతో కప్ దక్కించుకుంది. ఆస్ట్రేలియాలో 2011/12 లో సిరీస్ జరిగితే ఆస్ట్రేలియా 4_0 తేడాతో సిరీస్ దక్కించుకుంది. 2012/13 లో ఇండియాలో సిరీస్ జరిగితే ఇండియా 4_0 తేడాతో కప్ దక్కించుకుంది. 2014/15 లో ఆస్ట్రేలియాలో సిరీస్ జరిగితే ఆస్ట్రేలియా 2_0 తేడాతో కప్ దక్కించుకుంది. 2016/ 17 లో ఇండియాలో జరిగిన టోర్నీలో ఇండియా 2_1 తేడాతో కప్ దక్కించుకుంది..2018/19 లో ఆస్ట్రేలియాలో జరిగిన సీరిస్ లో ఇండియా 2_1 తేడాతో కప్ దక్కించుకుంది. 2020/21 లో ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ లో ఇండియా 2_1 తేడాతో కప్ దక్కించుకుంది.
ఇక ఇండియాలో ఇప్పటివరకు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కేవలం ఒక్కసారి మాత్రమే ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది. అది కూడా 2004లో. 19 సంవత్సరాలుగా ఇక్కడ మరో సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఎదురుచూస్తోంది. మొత్తంగా ఇప్పటివరకు 15 సిరీస్ లో 9 ఇండియా గెలిచింది. ఆస్ట్రేలియా ఐదు గెలిచింది. మరొకటి డ్రా గా మూసింది. ఇక ఆస్ట్రేలియాలో ఇండియా రెండు సిరీస్ లు సొంతం చేసుకుంది. 2016-17 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా దగ్గరే ఉంది. ఆ సంవత్సరం స్వదేశంలో జరిగిన సిరీస్ గెలిచిన ఇండియా.. 2018-19, 2020_21 వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియాలో రెండు సిరీస్ విజయాలు సాధించింది. ఇక ఇప్పుడు ఏడు సంవత్సరాలుగా తమకు దక్కని ట్రోఫీ కోసం ఇండియాకు వచ్చింది ఆస్ట్రేలియా. ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో టాప్ లో ఉన్న ఈ రెండు టీమ్స్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Border gavaskar trophy history indias hand on the ball so far
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com