Homeబాలీవుడ్Mirzapur Season 3: మీర్జాపూర్ సీజన్ 3 రక్తం రాసిన కథ స్ట్రీమింగ్ రెడీ అయింది...

Mirzapur Season 3: మీర్జాపూర్ సీజన్ 3 రక్తం రాసిన కథ స్ట్రీమింగ్ రెడీ అయింది…

మొదటి సీజన్ గురించి కనక ఒక్కసారి మనం తెలుసుకున్నట్లైతే అఖండనంద్ అలియాస్ కాలీన్ బాయ్.. మీర్జాపూర్ లో మాఫియా సామ్రాజ్యాన్ని ఎలుతున్న వ్యక్తిగా మనకు కనిపిస్తాడు.

Mirzapur Season 3: బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీర్జాపూర్ సిరీస్ భాషలతో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఇలాంటి సందర్భంలో ఈ సిరీస్ నుంచి వచ్చిన మొదటి రెండు సీజన్స్ కూడా సూపర్ సక్సెస్ అవడమే కాకుండా ఇప్పుడు రాబోతున్న మూడోవ సీజన్ కి కూడా విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సిరీస్ ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సిరీస్ మీద భారీ అంచనాలను పెట్టుకున్నారు…ఇక ఈనెల 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ‘అమెజాన్ ప్రైమ్’లో ఈ సీరీస్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సందర్భంలో మొదటి రెండు సీజన్లను ఒక్కసారి మనం గుర్తుచేసుకుందాం…

సీజన్ 1

ఇక మొదటి సీజన్ గురించి కనక ఒక్కసారి మనం తెలుసుకున్నట్లైతే అఖండనంద్ అలియాస్ కాలీన్ బాయ్.. మీర్జాపూర్ లో మాఫియా సామ్రాజ్యాన్ని ఎలుతున్న వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఇక ఇల్లీగల్ బిజినెస్ లను చేస్తున్న కాలీన్ భాయ్ కొడుకు అయిన మున్నాభాయ్ ఒక పెళ్లి ఈవెంట్లో తన గన్ పేలుస్తాడు. ఇక అప్పుడు ఆ పెళ్ళికొడుకు మరణిస్తాడు. ఇక దాంతో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు నిజాయితీపరుడైన రమాకాంత్ లాయర్ తో ఈ కేసు ను వాదించమని చెప్పి కోర్టు లో కేసు వేస్తారు. ఇక రమాకాంత్ కి ముగ్గురు పిల్లలు ఉంటారు. అందులో గుడ్డు పండిట్ (అలీ ఫజల్), బబ్లూ పండిట్ (విక్రమ్ మెస్సే), డింపి(హర్షిత) ఉంటారు. ఇక కాలీన్ భాయ్ తన కొడుకును కాదని తన వ్యాపార సామ్రాజ్యాలను గుడ్డు భాయ్ కి అప్పగిస్తాడు.. దీంతో మున్నాభాయ్ అసంతృప్తితో ఉంటాడు.

ఇక దానికి తగ్గట్టుగానే గుడ్డు డింపి స్నేహితురాలు అయిన స్వీటీ ని ప్రేమిస్తుంటాడు. ఇక స్వీటీ ని ఎలాగైనా దక్కించుకోవాలనుకునే ఉద్దేశ్యం లో ఉన్న మున్నా.. గుడ్డు అతని స్నేహితుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక పెళ్లి ఈవెంట్ కి హాజరైన గుడ్డు అతని స్నేహితుల మీద మున్నా దాడి చేస్తాడు. ఇక ఈ దాడిలో గర్భిణీ అయిన స్వీటీ తో పాటు బబ్లూ కూడా చనిపోతాడు. ఇక ఈ దాడిలో గుడ్డు ను కూడా చంపాలని ప్రయత్నం చేసిన అతను తన ఫ్రెండ్ అయిన గోలు తో కలిసి తప్పించుకుంటాడు…ఇక ప్రజల్లో తన మీద ఉన్న భయం తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతో కాలీన్ భాయ్ ఒక పోలీస్ ఆఫీసర్ ని హత్య చేయడంతో మొదటి సీజన్ ముగుస్తుంది…

సీజన్ 2

ఇక ఎక్కడైతే మొదటి సీజన్ ముగిసిందో అక్కడి నుంచే సీజన్ 2 ని కూడా స్టార్ట్ చేశారు. ఇక అందులో భాగంగానే మొదటి ఎపిసోడ్లో పాత్రల పరిచయాలను చేసి ఆ తర్వాత నుంచి ఈ సీరీస్ స్టోరీలోకి మనల్ని తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఇక అందులో భాగంగానే మక్బుల్ మున్నా వల్ల తన ఫ్యామిలీ సభ్యులందరిని కోల్పోతాడు. ఇక దాంతో తను కూడా ఎలాగైనా సరే కాలీన్ భాయ్ తండ్రిని చంపాలని ప్లాన్ వేసుకుంటాడు. ఇక ఈయన వేసిన ప్లాన్ లో కాలీన్ భాయ్ భార్య అయిన బీనా కూడా అతనికి సపోర్ట్ చేస్తుంది. కాలీన్ భాయ్ వాళ్ళ తండ్రిని చంపితే మీర్జాపూర్ మాఫియా సామ్రాజ్యం మీద కాలీన్ భాయ్ ఆధిపత్యం తగ్గుతుందని తను భావిస్తుంది…

ఇక మీర్జాపూర్ డాన్ గా సింహాసనాన్ని అధిష్టించాలనే ఉద్దేశ్యం తో ఉన్న మున్నా తన తండ్రి అయిన కాలీన్ భాయ్ ను కూడా చంపాలనుకుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కాలీన్ భాయ్ మీద దాడికి దిగిన సందర్భంలో కాలీన్ భాయ్ ఫ్రెండ్ అయిన శరద్ శుక్ల అతన్ని కాపాడుతాడు. ఇక అదే టైంలో గుడ్డు, గోలు ఇద్దరు కలిసి మున్నా మీద అటాక్ చేసి గుడ్డు మున్నాని చంపేస్తాడు. గుడ్డు సోదరుడు అయిన బబ్లు, స్వీటీల చావులకు ప్రతికారంగా గుడ్డు మున్నాని చంపడమే కాకుండా మీర్జాపూర్ సింహాసనాన్ని కూడా చేజిక్కించుకుంటాడు…

సీజన్ 3
ఇక ఈ సీజన్ ‘రక్తం తో రాసిన కథ’ గా మన ముందుకు రాబోతుంది. ఇక ట్రైలర్ లో చూపించిన దాన్ని బట్టి చూస్తే మున్నాభాయ్ ని చంపేయడంతో సీజన్ 3 లో గుడ్డు పూర్వంచల్ లో తను ఏది చెప్తే అది శాసనంగా జరగాలనే ఉద్దేశ్యంలో ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కాలీన్ భాయ్ వేసిన గుర్తులన్నింటిని చెరిపేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఇదే సమయంలో కాలీన్ భాయ్ వెనక్కి వచ్చి పూర్వంచల్ లో సింహాసనం అనేది వారసత్వం… అది మా నాన్న నుంచి నాకు వచ్చింది అంటూ చెప్పడంతో ఈ సీజన్ 3 మీద మరింత ఆసక్తిని పెంచే ప్రయత్నం అయితే చేశారు. ఇక జూలై 5వ తేదీన ఈ సీరీస్ స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఈ సీరీస్ మీద ఇప్పటికే అమితమైన ఆసక్తి అయితే నెలకొంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper