Homeబాలీవుడ్అయ్యో... దయనీయ పరిస్థితుల్లో ప్రముఖ నటి !

అయ్యో… దయనీయ పరిస్థితుల్లో ప్రముఖ నటి !

నటి ‘షగుప్తా అలీ’ అంటే హిందీ బుల్లితెర ప్రేక్షకులు బాగా ఇష్టపడే నటి. ఎన్నో సంవత్సరాల నుండి హిందీ ప్రేక్షకుల్ని తనదైన నటనతో ఆమె ఆకట్టుకుంటూ వస్తోంది. కానీ, కాలం ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించింది. కుటుంబ సభ్యులే ఆమెను మోసం చేశారు. దాంతో ఆమె ప్రస్తుతం ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడుతుంది. చివరికి తినడానికి కూడా లేక ఆమె ఇబ్బంది పడుతున్నారు.

ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఆమెకు అనారోగ్యం సంభవించింది. అయితే వైద్య చికిత్సల కోసం ఇప్పటికే ఆమె తన బంగారు ఆభరణాలను కూడా అమ్మేసుకున్నారు. అయినా సరైన ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు సరిపోలేదు. మరోపక్క ఆమెకు అవకాశాలు కూడా గత కొన్నేళ్లుగా రావడం లేదు. దాంతో ఆమెకు ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదు.

అయితే తన పరిస్థితి గురించి చెప్పి, తనకు సాయం చేయమని కోరుతూ ఆమె ఇటీవల సోనూసూద్‌ ని కలిసింది. ఆ విషయం గురించి చెబుతూ.. ‘నేను సుమారు 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో సీరియల్స్‌, ఎన్నో సినిమాల్లో నటించాను. కానీ ఆ దేవుడు నా పై చిన్న చూపు చూశాడు. నేను క్యాన్సర్ బారిన పడ్డాను. ఎంతో కష్టపడి నేను రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తీసుకున్నాను.

ఆ ట్రీట్మెంట్ కారణంగా నేను అప్పటివరకూ దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. దీనికి తోడు నాకు ఆఫర్స్ కూడా తగ్గాయి. అయినా నిరుత్సాహ పడలేదు. అవకాశాల కోసం ఎదురు చూశాను. కానీ అంతలో డయాబెటిస్‌, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు నన్ను కమ్మేశాయి. చికిత్స కోసం ఉన్న బంగారు ఆభరణాలనే కాదు, చివరకు కారు కూడా అమ్మేసుకున్నాను.

ఈ క్రమంలో ఆర్థిక సాయం కోరుతూ నేను సోనూసూద్‌ ని కలవడం జరిగింది. కానీ, సోనూ మాత్రం నాకు ఆర్థిక సాయం చేయలేదు అని షగుప్తా బాధగా చెప్పుకొచ్చింది. నిజమే ఆమె బాధ పడటంలో అర్ధం ఉంది. కానీ, సాయం చేయలేదని విమర్శించడం కరెక్ట్ కాదు. అయితే షగుప్తా గురించి తెలుసుకున్న కొందరు ఆమె సహ నటులు ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చారట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version