
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. పలు దేశాల్లలో కొవిడ్-19 డెల్టా వేరియంట్ కేసులు పెరగడంతో పాటు రేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ వ్యాఖ్యలు అంతర్జాతీయ సూచీలను కలవరపెడుతున్నాయి. ఉదయం 9.25 గంటల సమయంలో సెన్సెక్స్ 305 పాయింట్ల నష్టంతో 52,263 వద్ద.. నిఫ్టీ 77 పాయింట్లు దిగజారి 15,650 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.72 వద్ద ట్రేడవుతోంది.