
Anchor Vishnupriya : యాంకర్ విష్షుప్రియ టూ మచ్ బోల్డ్. ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా దారుణమైన ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. బికినీలో రెచ్చిపోయిన వన్ ఓన్లీ తెలుగు యాంకర్ విష్ణుప్రియ. కాగా ఆమె లేటెస్ట్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఓ వీడియో షేర్ చేసిన విష్ణుప్రియ ఈ అదృష్టం నాకు ఎప్పుడంటూ కామెంట్ పెట్టింది. ఆమె తీరుకు అందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. బాలీవుడ్ కపుల్ రన్బీర్ కపూర్-అలియా భట్ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ముంబైలో చక్కర్లు కొట్టారు.
రన్బీర్-అలియా భట్ లను జంటగా చూసిన మీడియా ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు. కారులో ఉన్న వీరిద్దరినీ ఫోటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు. అందరి ముందే అలియా రన్బీర్ సింగ్ కి ముద్దు ఇచ్చింది. రన్బీర్-అలియా రొమాన్స్ వీడియో పోస్ట్ చేసిన విష్ణుప్రియ ఈ అదృష్టం నాకెప్పుడు అంటూ కామెంట్ జోడించింది. దాంతో నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

అలాంటి కోరికలు ఉంటే వెంటనే పెళ్లి చేసుకో, ఒంటరిగా అల్లాడిపోవడం ఎందుకని ఆమెకు ఉచిత సలహా ఇస్తున్నారు. కాగా విష్ణుప్రియ కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది. మొదట్లో ఆమె చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోల్లో నటించారు. పోవే పోరా షోతో యాంకర్ అవతారం ఎత్తారు. సుడిగాలి సుధీర్ తో కలిసి విష్ణుప్రియ పోవే పోరా షోకి యాంకర్ గా వ్యవహరించారు. ఆ యూత్ ఫుల్ షో బాగానే టీఆర్పీ రాబట్టింది.
ఈ మధ్య బుల్లితెర మీద విష్ణుప్రియ సందడి తగ్గింది. ఆమెకు పెద్దగా కనిపించడం లేదు. గత ఏడాది విష్ణుప్రియకు సినిమా ఆఫర్ రావడం విశేషం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఓ పాత్ర చేశారు. సునీల్, అనసూయ, వెన్నెల కిషోర్ తో పాటు స్టార్ కమెడియన్స్ ఈ సినిమాలో నటించారు. హీరోయిన్ గా నటించాలనే నా కల నెరవేరకుండానే చనిపోతానేమో అని భయం వేసింది. వాంటెడ్ పండుగాడ్ తో ఆ కోరిక తీరిందని విష్ణుప్రియ అన్నారు.