Homeబాలీవుడ్Agra Trailer: అలాంటి సన్నివేశాల్లో రెచ్చిపోయిన నటించిన రుహాని శర్మ... సెన్సేషనల్ ట్రైలర్ వైరల్!

Agra Trailer: అలాంటి సన్నివేశాల్లో రెచ్చిపోయిన నటించిన రుహాని శర్మ… సెన్సేషనల్ ట్రైలర్ వైరల్!

Agra Trailer: హీరోయిన్ రుహాని శర్మ ‘ చి ల సౌ ‘ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ కి జంటగా ‘హిట్ ది ఫస్ట్ ఎటాక్ ‘ సినిమాలో నటించింది. ‘హిట్’ మూవీ తో మంచి క్రేజ్ దక్కింది. ‘ డర్టీ హరి ‘, ‘101 జిల్లాలకు అందగాడు’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక రీసెంట్ గా ఆమె నటించిన ‘ సైంధవ్ ‘ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆ చిత్రం ఫలితం ఇవ్వలేదు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తుంది. కాగా రుహాని శర్మ గత ఏడాది ‘ఆగ్రా’ అనే బాలీవుడ్ సినిమాలో నటించింది.

ఇందులో ఓ సన్నివేశంలో ఆమె రెచ్చిపోయి నటించింది. ఆగ్రా మూవీ 2023 ఏప్రిల్ 3వ తేదీన ఫ్రాన్స్ లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో రుహాని శర్మ నటించిన ఇంటిమేట్ సన్నివేశాలు హైలైట్ చేశారు. ఇందులో ఆమె మరీ పచ్చిగా కనిపించింది. దీంతో ఇది చూసిన తెలుగు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. కాగా ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.

రుహాని శర్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పంజాబీలో ‘ కుడి టు పటాకా ‘, ‘ కార్వా చౌత్ ‘, పాటియాలే వాలేను వంటి ఆల్బమ్స్ లో కనిపించింది. ‘ కాడయాసి బెంచ్ కార్తీ ‘ అనే తమిళ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆమె 2019 లో పాయిజన్, మీట్ క్యూట్ వెబ్ సిరీస్ లో నటించింది. ఇక ఇటీవల లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ హర్ చాప్టర్ 1’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అలాగే వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ ఆపరేషన్ వాలంటైన్ ‘ లో కీలక పాత్రలో కనిపించింది. కానీ ఈ చిత్రం ఆమెకు నిరాశే మిగిల్చింది. విక్టరీ వెంకటేష్ తో నటించిన సైంధవ్ సైతం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రుహాని శర్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి. రుహాని శర్మకు సరైన బ్రేక్ రాలేదని చెప్పొచ్చు.

 

Agra | Official Trailer | Kanu Behl | Rahul Roy | Mohit Agarwal | Priyanka Bose

Exit mobile version