Homeబాలీవుడ్Vidya Balan: సినిమా కోసం సిగరెట్ తాగి బానిసైన స్టార్ హీరోయిన్... రోజుకు ఎన్ని తాగేది...

Vidya Balan: సినిమా కోసం సిగరెట్ తాగి బానిసైన స్టార్ హీరోయిన్… రోజుకు ఎన్ని తాగేది అంటే?

Vidya Balan: ఓ బాలీవుడ్ హీరోయిన్ సిగరెట్ కి అలవాటు పడిందట. పాత్ర కోసం సిగరెట్ తాగితే అది అలవాటుగా మారిందట. ప్రతి రోజు సిగరెట్ తాగేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సౌత్ ఇండియా సెన్సేషన్ సిల్క్ స్మిత. ఏలూరుకు చెందిన విజయలక్ష్మి అనే అమ్మాయి అత్తారింటి బాధలు తట్టుకోలేక చెన్నై వెళ్లి నటిగా మారింది. సిల్క్ స్మిత అనే స్క్రీన్ నేమ్ తో దేశం మొత్తాన్ని ఆపేసింది. ముఖ్యంగా సౌత్ ఇండియా శృంగార తారగా కుర్ర హృదయాలను ఏలింది. వందల చిత్రాల్లో నటించింది.

సిల్క్ స్మిత 1996లో అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడింది. తనువు చాలించింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా డర్టీ పిక్చర్ పేరుతో ఓ మూవీ తెరకెక్కింది. సిల్క్ స్మిత పాత్రను విద్యా బాలన్ చేసింది. సిల్క్ స్మిత మద్యం, ధూమపానం చేస్తారని ఆ సినిమాలో చూపించారు. ఈ క్రమంలో విద్యాబాలన్ సిగరెట్స్ తాగాల్సి వచ్చింది. పాత్ర కోసం చేసిన ఆ పని అలవాటుగా మారిందట.

డర్టీ పిక్చర్ మూవీ అనంతరం విద్యాబాలన్ రోజుకు 2 నుండి 3 సిగరెట్లు తాగేదట. మొదట్లో సిగరెట్ పట్టుకోవడానికి ఇబ్బంది పడిన విద్యాబాలన్ దమ్ము కొట్టేదట. మరి ఇప్పుడు కూడా సిగరెట్ తాగుతున్నారా? అని మీడియా ప్రతినిధి అడగ్గా… ఆ విషయం పబ్లిక్ లో చెప్పను. అయినా నాకు సిగరెట్ వాసన అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో బస్ స్టాప్ వద్ద సిగరెట్ తాగే వ్యక్తి పక్కన నిల్చుని ఆ వాసన ఆస్వాదించే దానిని అని ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం విద్యాబాలన్ భూల్ బులయా 3లో నటిస్తుంది. కార్తీక్ ఆర్యన్ ఈ చిత్ర హీరో. తెలుగులో విద్యాబాలన్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం రోల్ లో ఆమె కనిపించారు. ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరలా విద్యాబాలన్ తెలుగులో నటించలేదు. విద్యాబాలన్ కి మంచి నటిగా పేరుంది.

RELATED ARTICLES

Most Popular