Nagarjuna
Bigg Boss Non Stop Telugu: తెలుగునాట బిగ్ బాస్ షో ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ అంటూ ఓటీటీ వేదికగా వస్తున్న బిగ్ బాస్ షో.. విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్కులతో.. కంటెస్టెంట్ ల మధ్య గొడవలు రంజుగా సాగుతున్నాయి. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. నాలుగో వారం రసవత్తరంగా సాగుతోంది.
Nagarjuna
17 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. మూడువారాల్లో ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, అర్జే చైతులు ఎలిమినేట్ అయిపోయారు. ఇక నాలుగో వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ షో మొదటినుంచి కొందరు మాత్రమే టైటిల్ ఫేవరెట్ గా నిలుస్తున్నారు. వారే ఓటింగ్ లో కూడా టాప్ లో నిలుస్తున్నారు. ప్రస్తుతం నాలుగు వారంలో అందరూ ఊహించినట్టుగానే ఓటింగ్ లో.. బిందు మాధవి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
Also Read: RRR Movie First US Review: ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ యూఎస్ రివ్యూ
తన ఆటతో అందరినీ మెప్పిస్తున్న యాంకర్ శివ కూడా భారీగానే ఓటింగ్ నమోదు చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగులో అతను రెండో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. అజయ్ తన పర్ఫార్మెన్స్ తో మూడో ప్లేస్ లో ఉన్నాడు. కాగా గతంలో టాప్ వన్ లో కొనసాగిన అరియాన గ్లోరీ ఈసారి నాలుగో ప్లేస్ కు పడిపోయింది.
Bigg Boss Non Stop Telugu
సరయు ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక గత వారంలో జరిగినట్టే.. మిత్రశర్మ ఈసారి కూడా చివరి రెండో స్థానంలో.. అంటే ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక అందరి కంటే చివరి స్థానంలో అనిల్ రాథోడ్ ఉన్నాడు. చూస్తుంటే ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఒకే ఒక్క సంఘటనతో ఓటింగ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి.. చివరి రోజు వరకు తారుమారు అయ్యే ఛాన్స్ లేక పోలేదు. చూడాలి మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో.
Also Read: RRR Story Leaked: బిగ్ బ్రేకింగ్.. ఆర్ఆర్ఆర్ కథ లీక్.. హైలెట్స్ ఇవే
Recommended Video:
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Bigg boss non stop telugu online voting results 4th week
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com