Bigg Boss 5 Telugu: సంచనాలకు కేరాఫ్ అడ్రస్ బిగ్ బాస్. ఎప్పుడు ఎవరికీ పూనకం పూనుతుందో, ఎప్పుడు ఎవరికి మెంటల్ వస్తుందో, ఎప్పుడు ఎవరు ఏడుస్తారో తెలీదు. రచ్చ ఎలా మొదలవుతుందో ఆఖరికి ఆ బ్రహ్మ దేవుడు కూడా కనిపెట్టలేడు. తాజా గా బిగ్ బాస్ పదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ హౌస్ లో అల్లోకల్లోలమే సృషించింది.
పదో వారానికి సంబంధించి కెప్టెన్ ఎంచుకోవడానికి కంటెస్టెంట్లకి బీబీ హోటల్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెస్ట్ టీం నుండి ఆర్జే కాజల్, సిరి హన్మంతు, వీజే సన్నీ, సీక్రెట్ టాస్క్ గెలిచిన యాంకర్ రవి కెప్టెన్సీ కంటెండర్లగా నిలుస్తారు. కెప్టెన్ ఎంచుకునే చివరి టాస్క్ టవర్ లో ఉంది పవర్ టాస్క్ పెద్ద దుమారమే లేపింది.
కెప్టెన్సీ టాస్క్ లో ఆర్జే కాజల్, సిరి హన్మంతు, వీజే సన్నీ, యాంకర్ రవి లకు బ్రిక్స్ తో టవర్ ని కట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కట్టిన టవర్ ని పడిపోకుండా కాపాడుకోవడమే పోటీదారుల ప్రధాన ధ్యేయం. ఫస్ట్ రౌండ్ లో కాజల్ టవర్ కూలిపోతుంది. దీనితో ఫస్ట్ రౌండ్ లోనే కాజల్ నిష్క్రమిస్తుంది. రెండో రౌండ్ లో, ఓడిపోయిన కాజల్, సన్నీ కి హెల్ప్ చేస్తుంది. ఈ క్రమం లో కాజల్, అని మాస్టర్ కి గిలిగింతలు పెట్టె ప్రయత్నం చేసింది. కాజల్ చేసిన పనికి అని మాస్టర్ కి కోపం వచ్చింది.
అని మాస్టర్ – కాజల్ మాటల యుద్ధం: రెండో రౌండ్ లో సన్నీ నిష్క్రమిస్తాడు. ఈ క్రమం లో కాజల్ – అని మాస్టర్ మధ్యలో పెద్ద ఎత్తున గొడవ సాగింది. ఈ క్రమంలో కాజల్ ని అని మాస్టర్ ఫాల్తూ గేమ్ లు ఆడకు, నాగిని అంటూ రెచ్చగొట్టింది. కాజల్ మాత్రం అని మాస్టర్ కి ధీటుగా సమాధానం ఇచ్చింది. అయితే ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు అని మాస్టర్ ని సోషల్ మీడియా వేదికగా మాటలతో దుమ్మెత్తి పోస్తున్నారు. ఆడదానికి ఆడదే శత్రువు అనే మాటని నిరూపించావు. సాటి ఆడదానిగా కాజల్ కి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. నిన్న (శుక్రవారం) జరిగిన ఎపిసోడ్ లో అని మాస్టర్ ప్రవర్తించిన తీరు చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు మండి పడుతున్నాడు.