
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని బైక్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ఇంద్ర నగర్ వద్ద చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.