Congress Vs BRS: 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అలాగని జనాలు వన్ సైడ్ విక్టరీని కాంగ్రెస్ పార్టీకి అందించలేదు. గులాబీ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఇప్పటికీ ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినప్పటికీ.. సర్పంచ్ ఎన్నికలలో సత్తా చూపించలేకపోయినప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గులాబీ పార్టీ కంటే అత్యంత బలంగా ఉంది. వాస్తవానికి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఒక విఫల ముఖ్యమంత్రి. ఇక మిగతా మంత్రుల సంగతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
నేటి కాలంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఆరోపణకు అధికార పార్టీ నుంచి కౌంటర్ ఉండాల్సిందే. అవసరమైతే ఆ కౌంటర్ చాలా సాలిడ్ గా ఉండాలి. దీనికోసం అనేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి అమలవుతున్న పథకాలను పకడ్బందీగా ప్రచారం చేసుకోవాలి. అదే సమయంలో గులాబీ పార్టీ చేసే విష ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలి. కానీ ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చేతకావడం లేదు. పైగా ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ అత్యంత దారుణమైన ప్రదర్శన చేస్తోంది. కౌంటర్ ఇవ్వడం కాదు కదా కనీసం.. తనను తాను కాపాడుకోవడం కూడా ఆ పార్టీకి, ఆ ఆ పార్టీ సోషల్ మీడియాకు ఏమాత్రం చేతకావడం లేదు.
తాజాగా గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా తెలంగాణ మంత్రుల మీద విష ప్రచారం మొదలుపెట్టింది. ఏకంగా ఆ మంత్రులు తమ స్థాయిని మర్చిపోయి, తమ వయసును మర్చిపోయి ప్రేమ వ్యవహారాలు సాగిస్తున్నారని బాంబు పేల్చింది. ఇటీవల సెక్రటేరియట్లో ఓ అధికారి షాడో గా వ్యవహరిస్తున్నారని.. పై స్థాయిలో అండదండలు ఉండడంతో క్యాబినెట్ స్థాయిలో ప్రోటోకాల్ ఇస్తున్నామని చెబుతున్నారని రాజ్ టీవీ ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. దానిని మర్చిపోకముందే ఎన్టీవీ నల్గొండకు సంబంధించిన ఓ మంత్రికి వ్యవహారాన్ని కథనం రూపంలో ప్రసారం చేసింది. నల్గొండ జిల్లా చెందిన ఓ మంత్రి.. ఓ కలెక్టర్ విషయంలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారని.. ఆమెతో ప్రేమ వ్యవహారం కూడా సాగించారని.. ఎన్టీవీ ఆ కథనంలో ప్రసారం చేసింది. అయితే ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఆ కలెక్టర్ ను ప్రభుత్వం బదిలీ చేయించిందని ఎన్ టీవీ ప్రసారం చేసిన కథనంలో పేర్కొంది.
రాజ్ టీవీ, ఎన్ టివి ప్రసారం చేసిన కథనాలను గులాబీ పార్టీ సోషల్ మీడియా తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈ కథనాలకు కాస్త మసాలా జోడించి ఆ పార్టీ సోషల్ మీడియా అడ్డగోలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ప్రేమ వ్యవహారాలలో మునిగి తేలుతున్నారని.. ఏకంగా సెక్రటేరియట్లో ఓ అధికారి తనకు పై స్థాయి అండ ఉందని ప్రచారం చేసుకుంటున్నారని.. అందువల్లే అధికారులు ఆమెకు క్యాబినెట్ స్థాయి ప్రోటోకాల్ ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి మహిళా అధికారులను వేధిస్తున్నారని.. కనీసం సీనియర్ మహిళా విలేకరులను కూడా వదిలిపెట్టడం లేదని.. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ గులాబీ పార్టీ సోషల్ మీడియా మాత్రం విపరీతంగా ప్రచారం మొదలుపెట్టింది. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.