https://oktelugu.com/

Megastar Chiranjeevi Guinness Record: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కినా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఏంటో తెలుసా?

Megastar Chiranjeevi Guinness Record: కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో ఎవరు అని అడిగితే టక్కుమని గుక్కతిప్పుకోకుండా ప్రతి ఒక్కరు ముక్త కంఠం తో చెప్పే హీరో పేరు మెగాస్టార్ చిరంజీవి..ఆయనకీ ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ నేటి తరం స్టార్ హీరోలెవ్వరికి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..తెలుగు సినిమా అంటే చిరంజీవి..చిరంజీవి అంటే తెలుగు సినిమా అనే రేంజ్ బ్రాండ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 19, 2022 / 12:02 PM IST

    Megastar Chiranjeevi Guinness Record

    Follow us on

    Megastar Chiranjeevi Guinness Record: కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో ఎవరు అని అడిగితే టక్కుమని గుక్కతిప్పుకోకుండా ప్రతి ఒక్కరు ముక్త కంఠం తో చెప్పే హీరో పేరు మెగాస్టార్ చిరంజీవి..ఆయనకీ ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ నేటి తరం స్టార్ హీరోలెవ్వరికి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..తెలుగు సినిమా అంటే చిరంజీవి..చిరంజీవి అంటే తెలుగు సినిమా అనే రేంజ్ బ్రాండ్ ఇమేజి ని ఏర్పరచుకున్నాడు ఆయన..అందుకే మూడు దశాబ్దాల నుండి ఆయన నెంబర్ 1 కిరీటాన్ని ఎవ్వరు అందుకోలేకున్నారు.

    Megastar Chiranjeevi Guinness Record

    Also Read: Puri Jagannadh- Charmi: చార్మితో తన సంబంధాన్ని బయటపెట్టిన పూరి జగన్నాథ్.. ఆ విషయంలో పూరి నిజంగా గ్రేట్ !

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నా ‘ఘరానా మొగుడు ‘ అనే సినిమా ప్రత్యేకత వేరు..కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..కేవలం బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రమే కాదు, 50 రోజుల కేంద్రాల విషయం లోను..అలాగే 100 రోజుల కేంద్రాల విషయం లోని ఈ సినిమా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఘరానా మొగుడు సినిమా అప్పుడు టికెట్ రేట్స్ కేవలం 5 రూపాయిలు మాత్రమే..ఆ 5 రూపాయిల టికెట్ రేట్స్ తోనే ఈ సినిమా అప్పట్లో 10 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..టాలీవుడ్ లో మొట్టమొదటి 10 కోట్ల సినిమా ఇదేనట..అంతే కాకుండా ఈ సినిమా తో కోటి రూపాయల పారితోషికం అందుకున్న మొట్టమొదటి ఇండియన్ హీరో గా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు..అంతే కాకుండా ఈ సినిమాని అప్పట్లో దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలు వీక్షించారట.

    Chiranjeevi Movie

    Also Read: Quarrels in Samantha house: సమంత ఇంట్లో గొడవలు.. చెంపచెళ్లుమనిపించిన కన్నతల్లి!

    ఇది ఒక ఆల్ టైం ఇండియన్ రికార్డు గా చరిత్ర కి ఎక్కడమే కాకుండా..గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది..అలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈనెల ఆగస్టు 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో స్పెషల్ షోస్ రూపం లో ప్రదర్శించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్.

    MegastR Chiranjeevi Birthday

    దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి..అప్పట్లో ఇండస్ట్రీ లో సరికొత్త బెంచ్ మార్కుని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు స్పెషల్ షోస్ ద్వారా కూడా కొత్త బెంచ్ మార్కుని అందుకొని రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి.
    Recommended Videos