Homeఆంధ్రప్రదేశ్‌Janasena Chief Pawan Kalyan: ఆ తొమ్మిది మందిపైనే.. పవన్ టార్గెట్ ఫిక్స్

Janasena Chief Pawan Kalyan: ఆ తొమ్మిది మందిపైనే.. పవన్ టార్గెట్ ఫిక్స్

Janasena Chief Pawan Kalyan: వైసీపీలో తొమ్మిది మంది నేతలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారా? వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారా? వారిని అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని వ్యూహం పన్నుతున్నారా? ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్న వారిని కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారా? అంటే జనసేనవర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పవన్ రాజకీయాలు మానలేదు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు వైసీపీ నేతలు మాత్రం అయినదానికి కానిదానికి పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. తూలనాడుతూ మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా కొడాలి నాని, పేర్ని నాని, అంటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్,వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, దాడిశెట్టి రాజాలు ఉదయం లేచింది మొదలు మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి పవన్ పై తిట్ల దండకానికి దిగుతున్నారు. దీనిని జనసైనికులు, పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి అంటూ పవన్ ను ఎగతాళి చేస్తుండడాన్ని గట్టిగానే బదులివ్వాలని డిసైడ్ అయ్యారు.

Janasena Chief Pawan Kalyan
Janasena Chief Pawan Kalyan

బలం బలహీనతలపై ఆరా..
ఈ తొమ్మిది మంది నాయకుల జాతకాలను పవన్ తెప్పించుకుంటున్నట్టు సమాచారం. వారి బలం ఏమిటి? బలహీనతలు ఏమిటని నివేదకలను తెప్పించుకొని పవన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఏ పార్టీకి మొగ్గు ఉంటుంది. పొత్తులతో ఏ పార్టీ అయితే వీరిని ఓడించగలరు అన్నది ఆరా తీస్తున్నారు. ఇక్కడ జనసేనకు ఉన్న బలం ఏమిటి? ఎలా ముందుకెళ్లాలి? అన్న వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. గుడివాడ నా అడ్డా. నన్నెవరూ ఏం పీకలేరు అంటూ కొడాలి నాని ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండడం పవన్ కు నచ్చడం లేదు. అందుకే నానిని ఎలాగైనా ఓడించాలన్న కసితో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే అక్కడ జనసేన వాయిస్ పెంచే ప్రయత్నంలో ఉన్నారు. మొన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడినప్పుడు గుడివాడను పేకాట డెన్ గా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: AP Politics- MP Gorantla Madhav: ఏపీలో దిగంబర రాజకీయాలు.. ఎవరికి చేటు?

గట్టి దెబ్బకొట్టాలని నిర్ణయం..
కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావులు తాజా మాజీ మంత్రులు. మంత్రులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు మాత్రం నోరేసుకొని పడిపోయేవారు. వీరి వైఖరిపై జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. తాజాగా అంబటి రాంబాబు కూడా స్వరం పెంచారు. 175 స్థానాల్లో పోటీచేస్తారో లేదో చెప్పండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.చేనేత వస్త్రాల ఛాలెంజ్ అంటూ అపహాస్యంగా మాట్లాడారు. దీంతో పవన్ అంబటి గురించి ఆలోచించడం ప్రారంభించారు. తాను ఒక రాజకీయ విధానం ప్రకటించిన తరువాత కూడా పదేపదే వ్యక్తిగత విమర్శలకు దిగుతుండడంతో తాను రంగంలోకి దిగాల్సిందేనని డిసైడ్ అయ్యారు. అంబటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో అంబటిని గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు.

Janasena Chief Pawan Kalyan
Janasena Chief Pawan Kalyan

ఏకతాటిపైకి శ్రేణులు..
మరోవైపు కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్ సైతం పవన్ విషయంలో అసందర్భ మాటలు, పేలాపనలకు దిగుతున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ఒంటికాలితో లేస్తున్నారు. కాపు సామాజికవర్గాన్ని ముడిపెట్టి మరీ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గతంలో పేర్ని నాని కూడా కులంను కించపరుస్తూ తనకు తాను జగన్ పాలేరునని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే మాదిరిగా అమర్నాథ్ వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో కాపు సామాజికవర్గంతో పాటు మెగా అభిమానులు అధికంగా ఉన్నవారు. వారందర్నీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో పవన్ ఉన్నారు.

Also Read:MP Gorantla Madhav Issue: ఏపీలో ‘న్యూడ్’ మంటలు..డర్డీ పిక్చర్ పై ఎంపీని కాపాడడానికి తంటాలు

 

జగన్ అడ్డా లో పవన్ || Janasena Janavani In Kadapa || Pawan Kalyan || Nadendla Manohar || Ok Telugu

 

గోరంట్ల మాధవ్ ని ఉతికిఆరేసినా టీడీపీ మహిళా | Tdp Mahila Leader Fires On  Gorantla Madhav | Ok Telugu

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version