UP Election 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయాల్లో నాటకీయ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. యూపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీపైనే కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక్కడ మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది. వచ్చేనెలలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, స్థానిక యోగి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఈసారి కూడా అక్కడ బీజేపీ పార్టీ విజయఢంకా మోగిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభుత్వానికి ఏ డోకా లేదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: గోదారోళ్లు అంటే మర్యాద… మర్యాద అంటే గోదారోళ్లు
ఈ నేపథ్యంలోనే యూపీ ఎన్నికల్లో బెంగాల్ సీన్ రిపీట్ అవుతుందని అక్కడి కాషాయ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. గడచిన బెంగాల్ ఎన్నికల ముందు టీఎంసీ నుంచి చాలా మందిని బీజేపీ పార్టీ చేర్చుకుంది. తీరా ఎన్నికల్లో మమతకు మూడోసారి పట్టం కట్టారు అక్కడి ప్రజలు. దీంతో బీజేపీలో చేరిన వారంతా తిరిగి అధికార తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం యూపీలో కూడా అదే తంతు జరుగుతోంది. బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రలు, 10 వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలో చేరారు. బీజేపీపై యూపీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. బెంగాల్లోనూ అప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందని జోరుగా ప్రచారం జరగగా, ఫలితం మాత్రం తలకిందులైంది.
యూపీలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. పలు సర్వేలు కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని, 403 స్థానాల్లో 202 మెజార్టీ స్థానాలను యోగి సర్కార్ కైవసం చేసుకుంటుందని బల్లగుద్ది చెబుతున్నారు. తమ పార్టీ నుంచి కొందరు నేతలు వేరే పార్టీలో చేరినంత మాత్రాన వారికి అధికారం వస్తుందని నమ్మితే అది మూర్ఖత్వమే అవుతుందని వాదిస్తున్నారు. బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో ఓటు బ్యాంకు చీలుతుందని బీజేపీ పార్టీ గట్టిగా నమ్ముతోంది. అది తమకే అనుకూలంగా మారుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: హ్యట్రిక్ తో ఆ హీరోయిన్ల రికార్డును సమం చేసిన ‘ఉప్పెన’ బ్యూటీ..!
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Bengal scene repeat in up do you know what happened then
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com