Horoscope Today, Rasi Phalalu Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 4న సోమవారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, మిథునం, సింహ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
కార్యాలయాల్లో ఉద్యోగులకు పదోన్నతులు పొందే అవకాశం. ఆర్థిక పరమైన చిక్కుులు రావొచ్చు. ఖర్చులను జాగ్రత్తగా పెట్టాలి. వ్యాపార ప్రణాళికలు వేయొచ్చు.
వృషభం:
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి చూపుతారు. ప్రత్యర్థులు ఆధిపత్యం చెలాయించే అవాకాశం ఉంది.
మిథునం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉపాధికి సంబంధించి కొన్ని వార్తలు వింటారు. అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానం పెరిగిపోతుంది.
కర్కాటకం:
కుటుంబ సభ్యులతో వాగ్వాదాలుంటే ఈరోజు పరిష్కారం అవుతాయి. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహం:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్యాలను నెరవేర్చేందుకు బాధ్యతగా వ్యవహరిస్తారు. ఇంటికి అతిథులు రావొచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య:
పెట్టుబడులకు అనుకూల సమయం. దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యలు పరిస్కరించబడుతాయి. తల్లిదండ్రులతో కలిసి తీర్త యాత్రలకు వెళ్తారు.
తుల:
ఆదాయం పెరుగుతుంది. పనులపై శ్రద్ధ చూపుతారు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్లు పాటించాలి. ఇతరులతో వాదనలకు దిగడం వల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంది.
వృశ్చికం:
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.
ధనస్సు:
ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల సాయంతో పెట్టుబడులు పెడుతారు. అయితే ఈ విషయంలో కాస్త ఆలోచించాలి. ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు.
మకరం:
ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. కొన్ని ఆలోచనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వస్తువుల కొనుగోలు కల నెరవేరుతుంది. జీవనశైలి మెరుగుపడుతుంది.
కుంభం:
కొన్ని పనులు పరిష్కరించడంలో ప్రణాళికతో వెళ్లాలి. అవివాహితులకు సంబంధాలు వచ్చే అవకాశం. ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం.
మీనం:
వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. ఆహ్లదకరమైన వాతావరణంతో ప్రియమైన వారితో ఉల్లాసంగా ఉంటారు.