Vastu Tips : రాత్రి నిద్రించే ముందు స్త్రీలు ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

లక్ష్మీదేవి ఇంట్లోకి ఏ సమయంలోనైనా అడుపెట్టవచ్చు. ఈ క్రమంలో రాత్రి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముఖ ద్వారం ముందు ఆవనూనెతో దీపం వెలిగించాలి.

Written By: NARESH, Updated On : October 2, 2023 2:31 pm
Follow us on

Vastu Tips : మనదేశంలో స్త్రీలకు ఎంతో గౌరవం ఉంది. స్త్రీని ఆదిశక్తిగా భావిస్తాం. స్త్రీ చేసే కొన్ని పనులు పురుషుల జీవితంపై ప్రభావం ఉంటుంది. ప్రతి మగవాడి విజయం, అపజయం వెనుక ఆడవారే ఉంటారని కొందరు చెబుతుంటారు కూడా. అలాంటి ఆడవారు ఇంట్లో చేసే పనులతో కూడా కుటుంబం పై ప్రభావం చూపుతుంది. వీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది. వీరు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కుటుంబం విషాదంలోకి వెళుతుంది. అందుకే చాలా మంది మగవాళ్లు ఇంట్లో ఆడవాళ్లను నిత్యం గౌరవిస్తూ ఉంటారు. వారు చేసే పనులకు అడ్డుచెప్పరు. ఈ క్రమంలో వారు కొన్ని పనులు చేయడం వల్ల ఇల్లు మరింత సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి నిద్రించే ముందు కొన్ని చోట్ల దీపాలు పెట్టడం వల్ల ఇంట్లో కొన్ని శుభాలు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపం వెలిగించడం ద్వారా ఎన్నో శుభాలు జరగుతాయి. దీపావళి పండుగకు ఇల్లు దీపాలతో కళకళలాడితే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని అంటారు. అయితే ప్రతిరోజూ ఇంట్లో పూజ గదిలో రాత్రి నిద్రించేముందు స్త్రీలు అగర్ బత్తిలు వెలిగించాలి. ఆ తరువాత ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వెళ్తుంది.

రాత్రి నిద్రించే ముందు కొన్ని కర్పూర బిల్లలను వెలిగించి ఇల్లు మొత్తాన్ని చూపాలి. ఇలా ప్రతి గదిలోకి కర్పూరంతో వెళ్లడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి. ఇక పడకగదిలో కర్పూరాన్ని వెలిగించడం వల్ల భార్యభర్తల మధ్య ప్రేమలు పెరిగిపోతాయి.

లక్ష్మీదేవి ఇంట్లోకి ఏ సమయంలోనైనా అడుపెట్టవచ్చు. ఈ క్రమంలో రాత్రి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముఖ ద్వారం ముందు ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.

సాధారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోయే ముందు లైట్లన్నీ ఆర్పేస్తారు. కానీ నైరుతి దిశలో ఉన్న దేవుని గది లో లేదా ఆ ప్రదేశంలో ఉన్న గదిలో దీపం వెలిగించాలి. ఇది సాధ్యం కాకపోతే బల్పు వెలిగే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యంలు తొలిగిపోతాయి.