Horoscope – Rasiphalalu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 29న ఆదివారం ద్వాదశ రాశులపై అశ్వనీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారికి ఈరోజు ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారం చేసేవారు రాణిస్తారు. గతంలో ఉన్న వివాదాలు ఈ రోజుతో ముగుస్తాయి. అయితే కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆచి తూచి వ్యవహరించాలి.
వృషభం:
ఈ రోజు వీరికి వాహనాల మూలంగా ఆకస్మిక ఖర్చులు ఏర్పడుతాయి. శత్రువులు మీపై ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారులు అనుకూలమైన రోజు.
మిథునం:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రుణాలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
అనుకున్న పనులు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. స్నేహితులతో ప్రయాణాలు చేస్తారు.
సింహం:
మీతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు అనుకున్న పనులు చేయగలుగుతారు. ఆరోగ్యం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.
కన్య:
బంధువులతో సంబంధాలు మెరుగుపడుతాయి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుతారు. పెండింగులో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తవుతాయి.
తుల:
ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వారు మీపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కోర్టు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారులకు మాత్రం లాభ సమయం.
వృశ్చికం:
కుటుంబ సభ్యలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరిగే అవకాశం. పెట్టుబడులు పెట్టే సమయంలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. భాగస్వామి నుంచి గౌరవం లభిస్తుంది.
ధనస్సు:
కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. ఏదైనా పని మొదలు పెడితే వారి నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మకరం:
వివాదాల జోలికి పోకూడదు. కొత్త పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. కొన్ని మార్గాల నుంచి కావాల్సిన డబ్బు అందుతుంది. ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన సమయం.
కుంభం:
రుణాలను తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పెట్టుబడులకు లాభాలు పొందే అవకాశం. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొన్ని విషయాల్లో తొందరపాటు వద్దు.
మీనం:
ఒక వార్త నిరాశను కలిగిస్తుంది. కుటుంబ సభ్యల తీరు బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ధనం వస్తుంది. వివాహ ప్రతిపాదలను రావొచ్చు. వ్యాపారులకు అనుకూల సమయం.