Today’s horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశరాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఊహించని ధన లాభం ఉండనుంది. మిగతా రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన రోజు. గతంలో మొదలుపెట్టిన కొన్ని పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. లేకుంటే అనారోగ్యం వాటిలే అవకాశాలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యులతో ఈరోజు ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈరోజు కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏదైనా వివాదం జరిగినప్పుడు దూరంగా ఉండటమే మంచిది. ఇంట్లో గొడవ జరిగితే మౌనంగా ఉండాలి. మాటల వల్ల కొందరి చేత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అనుకోకుండానే ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో ప్రణాళిక వేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులు ఈరోజు అనుకోకుండానే ధన లాభం పొందే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతున్నా.. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల విషయంలో కేర్ తీసుకోవాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి రెడీ అవుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో ఘర్షణ వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే ఓర్పు తో సమస్యను పరిష్కరించుకోవాలి. కొన్ని వస్తువుల కొనుగోలుకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో అనవసరమైన వాటికి డబ్బులు వెచ్చించకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు జీవిత భాగస్వామి కోసం విలువైన బహుమతిని అందిస్తారు. దీంతో ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగులు గతంలో చేసిన కొన్ని పనుల విషయంలో ప్రశంశలు పొందుతారు. అనుకోకుండా వీరికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు. గతంలో అనుకున్న ఓ పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులు కొన్ని కంపెనీలనుంచి శుభవార్తలు వింటారు. కొత్త సంబంధాలు పెరుగుతాయి. వ్యక్తిగత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఆగిపోయిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు రావడంతో మెరుగైన ఆదాయం లభించే అవకాశముంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఉండడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : మీ రాశి ఉద్యోగులు తమ భవిష్యత్తును గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినా వాటిని అధిగమించుకొని ముందుకు వెళ్తారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇవి వారి జీవితాన్ని నిలబెడతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈరోజు ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దీంతో వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థుల పోటీ పరీక్షల విజయవంతం కోసం తల్లిదండ్రులతో పాటు గురువుల సహకారం ఉంటుంది. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడంతో మనసు ప్రశాంతంగా మారుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంది. కుటుంబ సంబంధాల మెరుగుపై దృష్టి పెడతారు. ఏదైనా గొడవ ఉంటే వెంటనే పరిష్కారానికి ఆలోచిస్తారు. ఉద్యోగులు కొన్ని సవాలను ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తారు. వ్యాపారులకు కొత్తగా లాభాలు వచ్చి చేరుతాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈరోజు కొత్తగా పనిని ప్రారంభించే అవకాశం కూడా ఉంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయినా ఏ మాత్రం భయపడకుండా కొన్ని అడ్డంకులను దాటి ముందుకు వెళ్తారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు అధికంగా ఉంటుంది. ఉద్యోగులు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు అనుకున్న పనిని పూర్తి చేయడంతో తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు పొందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విదేశాలనుంచి శుభవార్తలు వినయ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించాలని అనుకుంటే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా ఎక్కువగా మాట్లాడితే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.