Today Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడంవల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 9న సోమవారం 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కుటుంబ సభ్యుల సహకారం ఉండే ఛాన్స్. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఓ సమాచారం బాధిస్తుంది. మనోబలం తగ్గకుండా ముందుకు వెళ్లాలి. గణపతి స్తోత్రం చదవడం మేలు.
వృషభం:
కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు వస్తాయి. బంధువులతో వివాదాలకు పోకుండా ప్రేమతో మెలగాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా మరింత మంచి జరుగుతుంది.
మిథునం:
కష్టజీవుల శ్రమ పెరుగుతుంది. కొన్ని రంగాల వారు విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సూర్యదేవారాధన శ్రేష్టం.
కర్కాటకం:
కొన్ని కీలక నిర్ణయాలు బంధువుల సహకారం ఉంటుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లువిరిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు వేంకటేశ్వర స్వామిని పూజించాలి.
సింహం:
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మనోదైర్యంతో ముందడుగువేయాలి. తోటివారి సహకారం అందుతుంది. దుర్గాదేవి ఆరాధన శ్రేష్టం.
కన్య:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తే ఫలితాలు ఉంటాయి. ఎవరితోనూ వాదోపవాదనలు చేసుకోవద్దు. గణపతి ఆరాధన మంచిది.
తుల:
కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. గణపతి పూజ శ్రేష్టం.
వృశ్చికం:
అనుకున్న పనులు నెరవేరుతాయి. ముఖ్య వ్యవహారాల్లో ఆర్థిక సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ముందడుగు వేస్తారు. బిల్వాష్టకం చదివితే అనుకూల ఫలితాలు.
ధనస్సు:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మనోబలం పెరుగుతుంది. ఉత్సాహంగా ముందుకు వెల్తారు. అష్టోత్తర శతనామావళి చదవాలి.
మకరం:
ఒక శుభవార్త వింటారు. మనసు ఉల్లాసంగా మారుతుంది. ఒక పనిలో ఇతరుల సహకారం ఉంటుంది. అవసరానికి తగిన ఆదాయం వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సూర్యదేవుని నమస్కారం చదవాలి.
కుంభం:
అనవసర కలహాలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొందరికి శ్రమకు తగిన ఫలితాల ఉంటాయి. శని శ్లోకం పఠించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.
మీనం:
కొన్ని పనుల్లో ఇబ్బందులు ఏర్పడొచ్చు. మనోబలంతో ముందుకు వెళ్లాలి. ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రులతో వివాదాలకు పోవద్దు. దుర్గాదేవిని పూజించాలి.