Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 18న ద్వాదశ రాశులపై మ్రుగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఆదివారం కొన్ని రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మరికొన్ని రాశుల వారు జీవిత భాగస్వామితో వాదనలకు దిగవద్దు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ఈ రోజు తెలియని వ్యక్తులను నమ్మొద్దు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా ఉంటారు. గతంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఏదైనా పనిని మొదలు పెట్టి ముందు ఇతరుల సలహా తీసుకోవడం మంచిది.
వృషభ రాశి:
ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్లతో వేధింపులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర వాదనలకు దిగవద్దు.
మిథునం:
ప్రయాణాలు ఉంటే మానుకోవడం మంచిది. కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి మార్గం ఏర్పాటు చూసుకుంటారు. ఎవరికైనా సలహా ఇస్తే వాళ్ళు పాటిస్తారు.
వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
కర్కాటకం:
వాహన ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగుతారు. ఉద్యోగులు కు కార్యాలయాల్లో కొంత అసౌకర్యంగా ఉంటుంది.
గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉంటే మంచిది.
సింహం:
శుభ కార్యాలయాల్లో పాల్గొంటారు. ఆస్తుల వివాదంలో సమస్యలు ఎదుర్కొంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఒక శుభకార్యం కోసం చర్చిస్తారు.
కన్య:
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో వెనక ముందు ఆలోచించాలి. చేసే పనిపై దృష్టి పెట్టాలి. కొందరికీ డబ్బు సాయం చేస్తారు.
తుల:
విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కొత్త పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక పర్యటనలు ఉంటాయి. సోదరులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి.
వృశ్చికం:
వ్యాపారులో భాగస్వామ్యంతో ఏ పని చేయకూడదు. కొన్ని ప్రయాణాల వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు మానసిక భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త పనులను మొదలు పెట్టడానికి ప్లాన్ వేస్తారు. జీవిత భాగస్వామ్యంతో సంతోషంగా ఉంటారు. రుణాలు చెల్లించడంలో సక్సెస్ అవుతారు.
మకర:
శత్రువుల సమస్య తొలగిపోతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొన్ని పనుల్లో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు అనుకూలం. వాతావరణం కుటుంబ సభ్యుల్లో ఒకరికి అసౌకర్యం కలుగుతుంది.
కుంభం:
కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం కలుగుతుంది. దీనివల్ల మానసిక ఆందోళన చెందుతారు. సామాజిక రంగంలో పనిచేసే వారికి ఇతరుల మద్దతు ఉంటుంది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.