Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 6న సోమవారం ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి మిగతా రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
పనులను సక్సెస్ చేయడానికి మద్దతు లభిస్తుంది. వాతావరణం అనుకూలంగా లేకపోయినా సంయమనం పాటించాలి. ఖర్చులను విపరీతంగా చేయొద్దు. రోజువారీ అవసరాలకు మాత్రమే యూజ్ చేయాలి.
వృషభం:
ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. పెళ్లి చేసుకునేవారికి కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. అయితే పెద్దల సహాయంతో పరిష్కారం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు.
మిథునం:
ఆర్థిక లావాదేవీలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియమైన వారితో వాదనలకు దిగొద్దు. కొన్ని శుభవార్తలు వింటారు.
కర్కాటకం:
అకస్మాత్తుగా డబ్బలు రావొచ్చు. దీంతో ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. ఏకాగ్రతతో పనులు చేస్తే అన్నింట్లో విజయం మీదే. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
సింహం:
ఉద్యోగులు కార్యాలయాల్లో వాదనలకు దిగకుండా ఉండాలి. వ్యాపారులకు ఇతరుల నుంచి గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ మాట తీరును గౌరవిస్తారు. కొన్ని పనులు నిలిచిపోయే అవకాశం ఉంది.
కన్య:
వ్యాపారులు భాగస్వాముల నుంచి లాభాలు పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సోదరులతో ఉన్న వివాదాన్ని పరిష్కారం చేసుకోవాలి. లేకుండా పెద్ద సమస్యగా మారుతుంది.
తుల:
పాత రుణాలు చెల్లిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మీ ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
వృశ్చికం:
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేవారు ఆకస్మిక లాభాలు పొందుతారు. పెట్టుబడి పెట్టేవారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకోవచ్చు.
ధనస్సు:
రుణం విషయంలో వాయిదా వేసుకోవడమే మంచిది. బంధువుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పునల్లో అడ్డుంకులు ఏర్పడుతాయి.
మకరం:
ఆర్థిక విషయంలో విజయం సాధిస్తారు. స్నేహితులను సాయం అడిగినా నిరాశ తప్పదు. జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు చేసేవారు సక్సెస్ అవుతారు.
కుంభం:
ఆకస్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రియమైన వారి నుంచి ఇబ్బందులు తప్పవు. కొంత ప్రతికూల వాతావరణం ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
మీనం:
ఇతరులకు రుణం ఇచ్చే విషయాన్ని ఒకటికి, రెండు సార్లు ఆలోచించాలి. జీవితంలో అడ్డుంకులు ఏర్పడితే బంధువుల సహాయంతో పరిష్కారం కావొచ్చు.