
రామతీర్థం ఘటనపై ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత లోకేశ్ కు సవాల్ విసిరాడు. ‘టీడీపీ నేత లోకేశ్ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తా.. చర్చకు సిద్ధం.. చర్చకు మీరే తేదీ చెప్పండి..’ అంటూ విజయసాయిరెడ్డి తెలిపాడు. కుట్రలకు టీడీపీ అధినేత చంద్రబాబు అంబాసిడర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ మంచి జరిగితే తన వల్లే అయిందని, చెడు జరిగితే ఇతరులపై బురదజల్లే వ్యక్తిత్వంమని విమర్శించారు. కాగా రామతీర్థంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఎదురెదురుపడ్డారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.