
ఆంధ్రప్రదేశ్‌లతో విద్యార్థుల కోసం వైసీపీ ప్రవేశపెట్టిన ‘విద్యాకానుక’ పథకం ప్రారంభానికి ఎట్టకేలకు తేదీ ఖరారైంది. ఈనెల 8న దీనిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇలా విద్యార్థికి కావల్సిన అన్నీ సదుపాయాలు ఈ కార్యక్రమం ద్వారా కల్పిస్తారు. దీంతో డ్రాపౌట్ సంఖ్యను తగ్గించి, అక్షరాస్యతను పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి ఇదివరకే పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడో ప్రారంభించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈనెల 8న ప్రారంభానికి ముహూర్తం కుదిరిందని విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.