
తెలుగుదేశం పార్టీకి కరోనా తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఆ వైరస్ తో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, ఇతర ప్రముఖులు మరణించారు. తాజాగా విజయవాడలోని తాజా మాజీ కార్పొరేట్లు కరోనాకు బలయ్యారు. విజయవాడలోని క్రుష్ణ లంక మాజీ కార్పొరేటర్ గోపర్తి నరసింహారావు, మధురానగర్ మాజీ కార్పొరేటర్ అత్కూరు రవి కుమార్ లకు కరోనా సోకింది. నరసింహారావు గత కొన్ని రోజుల కొందట వైరస్ సోకగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ఇక రవికుమార్ కరోనా సోకి తగ్గినా గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో విజయవాడ టీడీపీలో విషాదం నెలకొంది. వారి మృతి పట్ల టీడీపీ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. ఒకే రోజు ఇద్దరు నేతలు కోల్పోవడంతో టీడీపీలో విషాదం నెలకొంది.