https://oktelugu.com/

న్యాయవ్యవస్థలో భారీ కుదుపు..

దేశ న్యాయవ్యవస్థలో ఓ భారీ కుదుపు వచ్చింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 14మంది న్యాయమూర్తులు బదిలీ కావడం చర్చనీయాంశమైంది. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించడం సంచలనంగా మారింది. Also Read: ముస్లింలు మమతకు జాగీర్లు కాదంటున్న ఎంఐఎం నేత..! నలుగురు చీఫ్ జస్టిస్ లు బదిలీపై వస్తుండగా.. ఐదుగురు న్యాయమూర్తులు సీజేగా పదోన్నతి లభించింది. మరికొందరు హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. రాజకీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2020 / 08:29 AM IST
    Follow us on

    దేశ న్యాయవ్యవస్థలో ఓ భారీ కుదుపు వచ్చింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 14మంది న్యాయమూర్తులు బదిలీ కావడం చర్చనీయాంశమైంది. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించడం సంచలనంగా మారింది.

    Also Read: ముస్లింలు మమతకు జాగీర్లు కాదంటున్న ఎంఐఎం నేత..!

    నలుగురు చీఫ్ జస్టిస్ లు బదిలీపై వస్తుండగా.. ఐదుగురు న్యాయమూర్తులు సీజేగా పదోన్నతి లభించింది. మరికొందరు హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. రాజకీయ నాయకులను ముప్పు తిప్పలు పెట్టిన వారు లూప్ హోల్స్ పోస్టులకు పోయారు. ఇదే ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. అనుకూలురైన వారికి సరైన పోస్టులు దక్కాయన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

    హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను అక్కడి ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తున్న వారిని ప్రధానంగా బదిలీ చేశారని చర్చ జరుగుతోంది. తెలంగాణ సీజే రాఘవేంద్రసింగ్ ఉత్తరాఖండ్ కు బదిలీ అయ్యారు. ఏపీలో జగన్ సర్కార్ ను ముప్పుతిప్పులు పెడుతున్న సీజే మహేశ్వరి హిమాలయ సానువుల్లోని చిన్న రాష్ట్రం సిక్కింకు బదిలీ కావడం గమనార్హం. ఒడిషా సీజే మధ్యప్రదేశ్ కు.. సిక్కిం సీజే గోస్వామి ఏపీకి బదిలీ అయ్యారు.

    Also Read: శ్రీరాముడు మా పార్టీ వాడే: అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

    *చీఫ్ జస్టిస్ లుగా పదోన్నతి పొందిన వారు వీరే..
    ఇక హైకోర్టుల్లో పనిచేస్తున్న జస్టిస్ లు పలువురు సీజేలుగా పదోన్నతి పొందారు. ఢిల్లీ జస్టిస్ హిమా కోహ్లి తెలంగాణకు బదిలీ అయ్యారు. ఉత్త‌రాఖండ్ హైకోర్టులో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ సుధాంశు ధులియా ప‌దోన్న‌తిపై గౌహ‌తికి బ‌దిలీ అయ్యారు.కోల్‌క‌త్తాలో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ సంజీబ్ బెన‌ర్జీ మ‌ద్రాస్‌కు బ‌దిలీ అయ్యారు. అల‌హాబాద్‌లో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ పంక‌జ్ మిత్ర‌ల్ జ‌మ్మూక‌శ్మ‌ర్‌కు బ‌దిలీ అయ్యారు. పంజాబ్ లో ప‌ని చేస్తున్న జ‌స్టిస్ ఎస్‌. ముర‌ళీధ్ హ‌ర్యానాకు బ‌దిలీ అయ్యారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్