ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పింఛన్ల జారీలో ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేవారు ఆధార్‌కార్డు, అప్‌డేట్ హిస్టరీ ప్రింట్‌ఔట్ తప్పనిసరి చేసింది. కొంతమంది పుట్టిన తేదీని మార్చుకుంటూ పించన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారని, ఆ ముఠాను అరికట్టేందుకు అప్‌డేట్ తప్పనిసరి చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. పింఛన్ల జారీలో అక్రమాలు అరికట్టేందుకే ఈ నిబంధనలు పెడుతున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.