https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ మరో రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతున్న శిల్పం ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత తీస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇద్దరు అగ్రహీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ టీజర్లు ఇటీవలే విడుదలై దుమ్ము రేపాయి. అల్లూరిగా రాంచరణ్ వీరోచితం.. కొమురం భీంగా ఎన్టీఆర్ పౌరుషం నభూతో నభవిష్యతి అన్నట్టుగా టీజర్ లో కనిపించింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. తెలుగు సినీ […]

Written By: , Updated On : October 31, 2020 / 03:00 PM IST
Follow us on

దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతున్న శిల్పం ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత తీస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇద్దరు అగ్రహీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ టీజర్లు ఇటీవలే విడుదలై దుమ్ము రేపాయి. అల్లూరిగా రాంచరణ్ వీరోచితం.. కొమురం భీంగా ఎన్టీఆర్ పౌరుషం నభూతో నభవిష్యతి అన్నట్టుగా టీజర్ లో కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. తెలుగు సినీ పరిశ్రమలోనే ఇప్పటివరకు అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా ‘భీమ్ ఫర్ రామరాజు’ రికార్డు సొంతం చేసుకుంది.

Also Read: మూడేళ్ళ వయసులోనే లైంగిక దాడికి గురయ్యానంటున్న హీరోయిన్

రాంచరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ‘ఆర్ఆర్ఆర్’నుంచి ‘భీమ్ ఫర్ రామరాజు’ అనే పేరుతో స్పెషల్ టీజర్ రిలీజ్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వాయిస్ తో రాంచరణ్ ను అల్లూరి సీతారామరాజుగా పరిచయం చేస్తూ వచ్చిన ఈ టీజర్ కు అభిమానులు ఫిదా అయ్యారు.

కాగా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ టీజర్ ను ఏకంగా 33.3 మిలియన్ల మంది అధికారిక యూట్యూబ్ చానెల్ లో వీక్షించారు. దీంతో తెలుగులోనే అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా ‘భీమ్ ఫర్ రామరాజు’గా ఈ టీజర్ ఘనత దక్కించుకుంది.

Also Read: పవన్ కల్యాణ్ సినిమాకు కొత్త సమస్య..!

Bheem For Ramaraju - Ramaraju Intro - RRR(Telugu) | NTR, Ram Charan, Ajay Devgn | SS Rajamouli