
తెలుగుదేశం పార్టీ సమావేశం సోమవారం ప్రారంభమైంది. అంతకుముందు పొలిట్ బ్యూరోలో కొత్తగా నియామకమైన వారు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రైతుల ఆత్మహత్యలకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక, అమరావతి భవిష్యత్ కార్యాచరణ, రైతుల బస్సు యాత్రకు సంబంధించిన విషయాలపై చర్చిస్తారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ఆలయాల దాడులు తదితర విషయాలపై సమీక్షిస్తారు.