
కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన నంద సుబ్బయ్య అంత్యక్రియలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రొద్దుటూరుకు వెళ్లనున్నారు. కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో నిన్న దారుణ హత్యకు గురయ్యాడు. కొద్ది రోజులుగా సుబ్బయ్య సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన హత్యకు గురవడం సంచలనంగా మారింది. జిల్లాలోని సోమువారిపల్లెలోని ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన స్థలాల్లో సుబ్బయ్య శవం పడి ఉండడం కలకలం రేపింది.ఈ సంఘటనపై టీడీపీ నేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.