
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గడ్డకట్టే చలిలో సైతం నెరవకుండా రైతులు తమ డిమాండ్ల పరిష్కారానికి భీష్మించుకు కూర్చున్నారు. కాగా ప్రభుత్వం బుధవారం రైతలను చర్చలకు ఆహ్వానించడంతో ఇందుకు రైతులు అంగీకరించారు. దీంతో నేడు రైతులతో ప్రభుత్వం చర్చలు జరపునుంది. అయితే రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దు తప్ప ఇంకేం ప్రతిపాదన పెట్టినా ఒప్పుకోమంటున్నారు. ప్రభుత్వం మాత్రం రైతులను సంత్రుప్తి పరిచేయాల చట్టంలో సంస్కరణలు చేపడుతామని హామీ ఇస్తోంది. రెండు సంవత్సరాల పాటు చట్టాల అమలు చూడండి ఆ తరువాత వాటి పరిస్థితిని భట్టి వ్యతిరేకించడని ఇటీవల కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కానీ రైతుల మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.