
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మల్యే సత్యప్రభ అనారోగ్యంతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున చిత్తూరు ఎమ్మల్యేగా సత్యప్రభ పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2019లోనూ పోటీ చేసినా ఓడిపోయారు. అయితే ఇటీవల టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆమె మరణంతో ఏపీ టీడీపీలో విషాదం నెలకొంది. గత కొంత కాలంగా టీడీపీలో పలువురు ప్రముఖ నాయకులు మరణించడంతో పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.