https://oktelugu.com/

బీజేపీకి అంత సీన్‌ ఉందా..!

దుబ్బాక ఫలితం ఒక విధంగా భారతీయ జనతా పార్టీకి బూస్టింగ్‌ ఇచ్చినట్లే. అందుకే.. కమలనాథులు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో గ్రేటర్‌‌ ఎన్నికలకు సిద్ధమయ్యారు. మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ కుమార్‌‌ కూడా ఎంతో ధీమాతో ఉన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామంటూ ప్రకటించారు. గ్రేటర్‌‌ పైనా బీజేపీ జెండా ఎగురుతుందంటూ చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో అధికార పక్షానికి సవాళ్లూ విసురుతున్నారు. Also Read: టీఆర్ఎస్ 2వ జాబితా: సిట్టింగ్ లకు, మేయర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2020 / 08:39 AM IST
    Follow us on

    దుబ్బాక ఫలితం ఒక విధంగా భారతీయ జనతా పార్టీకి బూస్టింగ్‌ ఇచ్చినట్లే. అందుకే.. కమలనాథులు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో గ్రేటర్‌‌ ఎన్నికలకు సిద్ధమయ్యారు. మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ కుమార్‌‌ కూడా ఎంతో ధీమాతో ఉన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామంటూ ప్రకటించారు. గ్రేటర్‌‌ పైనా బీజేపీ జెండా ఎగురుతుందంటూ చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో అధికార పక్షానికి సవాళ్లూ విసురుతున్నారు.

    Also Read: టీఆర్ఎస్ 2వ జాబితా: సిట్టింగ్ లకు, మేయర్ బొంతుకు షాక్.. కొత్తవారికి టికెట్లు

    బీజేపీ నేతలు చెబుతున్నట్లు ఇవన్నీ సాధ్యపడే అంశాలేనా. తెలంగాణ రాష్టాన్ని చేజిక్కించుకునే సత్తా బీజేపీకి ఉందా? అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదనే చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నిక వేరు.. మిగితా ఎన్నికలు వేరు. అక్కడ అనేక కారణాలు బీజేపీ సానుకూలంగా పనిచేశాయి. టీఆర్ఎస్ ఓటమికి అక్కడ అభ్యర్థి ఎంపిక కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. సానుభూతి పనిచేయకపోవడానికి కూడా అనేక కారణాలున్నాయి. ఇది కేవలం బీజేపీ పట్ల సానుకూలత కాదు. టీఆర్ఎస్ లో ఉన్న లోపాలు బీజేపీకి దుబ్బాకలో లబ్ధిని చేకూర్చి పెట్టాయి.

    అయితే.. ఇక్కడ బీజేపీ తరఫున రఘునందన్‌రావు కాకుండా మరే అభ్యర్థి అయినా కనీసం డిపాజిట్‌ కూడా దక్కేవి కావని రాజకీయ నిపుణులు అంటున్నారు. రఘునందన్‌రావుకు ఉన్న క్యాడర్‌‌తోపాటు.. ఆయనపై ఉన్న సింపతితో బీజేపీ బయటపడిందని చెప్పుకొస్తున్నారు. ఆయన ఓడిపోయినా కూడా ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు కూడా. ఇక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ఇలాంటి నాయకత్వం లేదనే చెప్పాలి. అందుకే.. ఆ పార్టీ నేతలు తమను తాము ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుందేమో.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రూ.75,000 వేతనంతో ఉద్యోగాలు..?

    తెలంగాణలో మొత్తంగా చూస్తే 30 నుంచి 40 నియోజకవర్గాల్లో బీజేపీ మంచి క్యాడర్‌‌ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును మాత్రమే సాధించిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు సాధించడం కూడా అక్కడి నాయకత్వం పటిష్టమైనది కావడమే. అందుకే.. దుబ్బాకలో గెలిచినంత మాత్రాన సంబరపడి చంకలు గుద్దుకోవడం సరికాదని సూచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రావడం అంటే అది కాని పనే అని అంటున్నారు. సరే.. బీజేపీ సత్తా ఎంతనో ఈ గ్రేటర్‌‌ ఎలక్షన్స్‌లో చూస్తే ఎలాగూ అర్థమవుతుంది కదా..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్