https://oktelugu.com/

నివర్ ఎఫెక్ట్: తిరుమలలో భారీ వర్షం.

నివర్ తుఫాను ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపిస్తోంది. బుధవారం తెల్లవారుజామున నుంచి చిత్తూరు జిల్లా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండగా దర్శనానికి వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. మరోవైపు ఆలయంలోకి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో సిబ్బంది నీటిని ఎప్పటికప్పడు బయటకు తోడేస్తున్నారు. కొన్ని రోజుల కిందట తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మరోసారి అలాంటి సంఘటన జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతే తరహా వాతావరణం మరో […]

Written By: , Updated On : November 25, 2020 / 12:01 PM IST
Follow us on


నివర్ తుఫాను ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపిస్తోంది. బుధవారం తెల్లవారుజామున నుంచి చిత్తూరు జిల్లా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండగా దర్శనానికి వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. మరోవైపు ఆలయంలోకి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో సిబ్బంది నీటిని ఎప్పటికప్పడు బయటకు తోడేస్తున్నారు. కొన్ని రోజుల కిందట తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మరోసారి అలాంటి సంఘటన జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతే తరహా వాతావరణం మరో రెండు రోజులు ఉండడంతో వర్షం పడే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు.