పెళ్లికి వెళ్లి వస్తున్న వ్యాన్ బోల్తాపడి ఆరుగురు మృతి చెందిన సంఘటన తూర్చుగోదావరి జిల్లాలో జరిగింది. గోకవరం మండలం ఠాకూర్‌పాలెంకు చెందిన కొందరు తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన వివాహా వేడుకకు గురువారం హాజరయ్యారు. తిరిగి వస్తుండగా ఈరోజు తెల్లవారు జామున కొండపై నుంచి అదుపుతప్పి వ్యాన్ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే బ్రేక్ ఫెయిలవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.