https://oktelugu.com/

సోనూసుద్‌ : వారిని ఆదుకున్నాడు.. వీరికి షాక్‌ ఇచ్చాడు..!

సినిమాల్లో విలనిజం చూపించిన సోనూసుద్‌ కరోనా సమయంలో మాత్రం దేశ ప్రజలకు హీరో అయ్యాడు. పేదలను, వలసకార్మికులను ఆదుకున్న ఈ పశుపతి జనాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అవసరమైనవారికి తక్షణమే సాయం అందిస్తూ ఆపన్నహస్తుడిగా నిలిచాడు. ప్రస్తుతం ఆన్‌లాక్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు మొదలవుతున్నాయి. థియేటర్లు కూడా అక్కడక్కడా ఓపెన్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో సినిమాలు తీస్తున్న కొందరు సినీ దర్శకులు సోనూసుద్‌ను తమ సినిమాల్లోకి తీసుకుంటే మంచి క్రేజ్‌ ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 08:26 AM IST
    Follow us on

    సినిమాల్లో విలనిజం చూపించిన సోనూసుద్‌ కరోనా సమయంలో మాత్రం దేశ ప్రజలకు హీరో అయ్యాడు. పేదలను, వలసకార్మికులను ఆదుకున్న ఈ పశుపతి జనాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అవసరమైనవారికి తక్షణమే సాయం అందిస్తూ ఆపన్నహస్తుడిగా నిలిచాడు. ప్రస్తుతం ఆన్‌లాక్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు మొదలవుతున్నాయి. థియేటర్లు కూడా అక్కడక్కడా ఓపెన్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో సినిమాలు తీస్తున్న కొందరు సినీ దర్శకులు సోనూసుద్‌ను తమ సినిమాల్లోకి తీసుకుంటే మంచి క్రేజ్‌ ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మంచి పాపులారిటీ సాధించిన ఆయన తమ సినిమాల్లో వాడుకుంటే ఫ్రీగా పబ్లిసిటీ అయ్యే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఈ నేపథ్యంలో తెలుగు మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి తాజాగా తాను తీయబోయే సినిమాలో సోనూసుద్‌ను పెట్టాలనుకున్నాడు. అంతకుముందు సంజయ్‌దత్‌ను అనుకున్నా.. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సోనూసుద్‌ను వద్దకు వెళ్లాడట. అయితే పేద ప్రజలకు దైవంగా మారిన సోనూసుద్‌ సినీ నిర్మాతలకు మాత్రం షాక్‌నిస్తున్నాడు. తాను నటించేందుకు రూ. 4కోట్లు అడిగాడట. దీంతో బోయపాటి మాట మాట్లాడకుండా వెనుదిరిగి వచ్చేశాడట. మరో నిర్మాత కూడా ఇలాగే రెమ్యూనరేషన్‌ విషయంలో షాక్‌ తిని రివర్స్‌ అయ్యాడట.

    Also Read: ప్రభాస్ కష్టాలను చూసి చలించిన నితిన్.. ఏం చేశాడంటే?

    తెలుగు సినిమాల్లో హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇవ్వలేమని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం రెమ్యూనరేషన్‌ విషయంలో ప్రభాస్‌, మహేశ్‌, మెగాస్టార్‌ చిరంజీవిలు లీడ్‌లో ఉన్నారు. ఇప్పుడు వారి కంటే ఎక్కువ ఇచ్చి తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుగు ఫిల్మ్‌ నిర్మాతలు భావిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం సోనూసుద్‌ చెప్పిన రేటుకు ఓకే అంటున్నారట.

    Also Read: ప్రభాస్ సినిమాను పట్టించుకున్నవారే లేరు !

    ప్రస్తుత సీజన్‌లో సినిమాలకు పెద్దగా ఆదరణ లేదు. సినిమా థియేటర్లు నిబంధనలతో నడిపించుకోవచ్చని ప్రభుత్వం చెప్పినా ప్రేక్షకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కేవలం నటులకే అంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టి సినిమాలు తీయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అందువల్ల సోనూసుద్‌ లేకున్నా సినిమా తీయగలమని నిర్మాతలు భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది.